Chaysam Wedding Anniversary: Ahead Of 4th Anniversary ChaySam Divorced - Sakshi
Sakshi News home page

Samantha: సమంత కట్టుకున్న పెళ్లి చీర ఎవరిదో తెలుసా?

Published Tue, Oct 5 2021 2:38 PM | Last Updated on Wed, Oct 6 2021 11:57 AM

Ahead Of 4th Anniversary Chaitanya samantha Make Divorce Official - Sakshi

Ahead Of 4th Anniversary Chay Sam Make Divorce Official: టాలీవుడ్‌ మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌ సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడపోవడం ఏంటన్న చర్చ నడుస్తుంది. పెళ్లి రోజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందు తాము ఇక కలిసి ఉండలేమని ప్రకటించి అభిమానులకు నిరాశలో ముంచేశారు. చై-సామ్‌ పెళ్లిరోజు(అక్టోబర్‌6) నేపథ్యంలో వీరి ప్రేమ, పెళ్లి తదనంతర పరిణామాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చదవండి:  బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌: ప్రేమించి పెళ్లాడిన భర్త ఆత్మహత్య, రెండో పెళ్లి

‘ఏమాయ చేసావె’సినిమాతో మొదలైన వీరి స్నేహం పెళ్లి దాకా వెళ్లింది.  ఇరు కుటుంబాలను ఒప్పించి  మరి 2017, అక్టోబర్‌6న హిందూ, మరుసటి రోజు క్రిస్టియన్‌ పద్ధతిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా సమంత ధరించిన పెళ్లి చీరపై అప్పట్లో తెగ చర్చ జరిగింది.

పెళ్లి మండపంలో సమంత కట్టుకున్న చీర చైతన్య అమ్మమ్మ, రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. ఆ చీరను రీ మోడలింగ్‌ చేయించి ఎంతో ముచ్చటగా సమంత దాన్ని ధరించింది. ఇందుకోసం సుమారు రూ. 40 లక్షల వరకు ఖర్చయింది. పెళ్లి నాటికి సమంత స్టార్‌ హీరోయిన్‌ అయ్యిండి కూడా అటు సాంప్రదాయం, ఇటు పెద్దల్ని గౌరవించడం విశేషంగా నిలిచింది.  అంతేకాదు వారి పెళ్లి ఫోటోలు సైతం ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. చదవండి: ఆ విషయం సమంత-నాగ చైతన్యలకే తెలుసు: ఖుష్బూ

ఇక పెళ్లి తర్వాత‘చై-సామ్‌’జోడీకి వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు.  ఎంతో చూడముచ్చటైన జంట అంటూ ఫ్యాన్స్‌ సంబర పడిపోయారు. అందుకే పలు యాడ్‌ కంపెనీలు సైతం సమంత-నాగ చైతన్యలను జంటగానే సంప్రదించేవారు. ఇక సామ్‌ అయితే చైతో​ కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసుకొని ముచ్చటపడేది. కలిసి సినిమాలు చూడటం, వర్కవుట్స్‌ చేయడం వంటి విశేషాలతో నెట్టింట సందడి చేసేది.

కానీ ఉన్నట్లుండి సోషల్‌ మీడియా అకౌంట్లలో తన పేరు మార్చుకొని చర్చకు దారితీసింది. ఇద్దరి మధ్యా ఏదో జరుగుతుందన్న ఊహాగానాలు హల్‌చల్‌ చేశాయి. కట్‌ చేస్తూ ఆ రూమర్స్‌నే నిజం చేస్తూ అక్టోబర్‌2న విడిపోతున్నట్లు అనూహ్య ప్రకటన చేశారు. విడిపోతున్న క్రమంలో కూడా ఇద్దరూ ఒకే రకమైన పోస్టును షేర్‌ చేశారు. చదవండి:ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది: నాగ చైతన్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement