అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఎన్‌సీ23. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలొచ్చాయి. అయితే చైతూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నవంబర్ 23న నాగచైతన్య బర్త్ డే కావడంతో ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. పోస్టర్ చూస్తే మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తండేల్ అనే టైటిల్ రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
అయితే ఈ సినిమాను శ్రీకాకుళం మత్స్యకారుల రియల్ స్టోరీనే తెరకెక్కిస్తున్నారు. 2018 నవంబరులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు గుజరాత్‌లో వీరవల్ వద్ద సముద్రంలో చేపల వేట సాగిస్తూ ఉండేవారు. అలా ఒక రోజు చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు పొరపాటున పాక్ కోస్టు గార్డులకు బందీలుగా చిక్కారు.
వీరంతా పాకిస్థాన్‌లో దాదాపు ఏడాదిన్నర పాటు జైల్లోనే ఉన్నారు. అయితే వీరిలో ఓ మత్స్యకారుడు పెళ్లైన కొద్ది రోజులకే కోస్టు గార్డులకు చిక్కడం, ఇక్కడేమో భార్య గర్భిణీ కాగా.. ఏ బిడ్డ పుట్టిందో కూడా తెలియని స్థితి. అలానే బాలింతగా అతని భార్య పడే అవస్థలు, కొన్ని సంఘటనల ఆధారంగా ప్రేమకథను జోడించి స‍్టోరీని తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు, నాగచైతన్య నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘దూత’ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబరు 1న విడుదల కానుంది.
అసలు తండేల్ అంటే ఏంటి?
అయితే మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్‌పై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అసలు తండేల్ అనే పేరుకు అర్థమేంటి? అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. కొందరేమో తండేల్ అంటే పడవను ఏ దిశలో వెళ్లాలనేది నిర్ణయిస్తుందని అంటున్నారు. మరికొందరేమో తండేల్ అంటే కెప్టెన్, నాయకుడు అని చెబుతున్నారు. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తేనే అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది.
#NC23 is #Thandel
— chaitanya akkineni (@chay_akkineni) November 22, 2023
A character I’m really looking forward to playing .. and a team I’m really fond of @chandoomondeti, @Sai_Pallavi92, @ThisIsDSP and every one at @GeethaArts.
Shoot begins soon :)
దుల్లకొట్టేదాం ✊🏽
జై దుర్గా భవాని🙏#AlluAravind #BunnyVas #Riyaz @ThisIsDSP… pic.twitter.com/Waeahc3Psa
Comments
Please login to add a commentAdd a comment