బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవల షూటింగ్ నేపథ్యంలో లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే నిన్న(ఆదివారం) హుటాహుటిన ఆయన ముంబై చేరుకున్నారు. ఆయన తల్లి అరుణ భాటియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ముంబైలోని హీరానందాని హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం తను ఐసీయూ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే తల్లి అనారోగ్యంపై సమాచారం అందిన వెంటనే అక్షయ్ షూటింగ్‌ను నుంచి వెంటనే ఇండియాకు తిరిగి వచ్చాడు. రాత్రి ముంబై ఎయిరోపోర్టుకు చేరుకున్న అక్షయ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చదవండి: ‘సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు’
కాగా గత కొద్ది రోజులుగా అరుణ భాటియా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కాగా అక్షయ్‌కి తల్లి అంటే అమితమైన ప్రేమ. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని దగ్గరుండి చూసుకునేవాడట. ఈ క్రమంలో సిండ్రెల్లా మూవీ షూటింగ్ కోసం యూకే వెళ్లిన ఆయన తల్లి అస్వస్థతకు గురయ్యారని తెలియాగానే ఆగ మేఘాల మీద యూకే నుంచి ముంబైకి చేరుకున్నాడు. అక్కడ షూటింగ్ మధ్యలో వచ్చేసిన అక్కి తాను లేని సన్నివేశాలను చిత్రీకరించాల్సిందిగా డైరెక్టర్‌కు తెలిపినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment