
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్. మానుషి చిల్లర్ కథానాయికగా నటించింది. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య జూన్ 3న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే ఆడింది. దీంతో నెల రోజుల్లో ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. జూలై 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
ఇకపోతే రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల మార్క్ కూడా అందుకోకపోవడం గమనార్హం. దీంతో వీలైనంత త్వరగా ఓటీటీలో అందుబాటులో ఉంచాలని ఇందుకోసం భారీ మొత్తంలో డిమాండ్ చేశారని తెలుస్తోంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ ఏకంగా రూ.150 కోట్లు అందుకున్నట్లు సమాచారం.
చదవండి: ఆ షోకి అనసూయ గుడ్‌బై.. చేదు క్షణాలంటూ ఎమోషనల్ పోస్ట్
రాజమౌళి మగధీరలో ఆఫర్ ఇచ్చారు, కానీ నేనే..
Comments
Please login to add a commentAdd a comment