
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్ను లో వణుకు పుట్టిస్తోంది. మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజటివ్‌గా తేలిందని ఆదివారం ఉదయం తన ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. "ఈ ఉదయం, నేను కోవిడ్ -19 పాజిటివ్ అని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. త్వరగా మీ ముందుకు వస్తాను అంటూ ట్వీట్ చేశారు. ( చదవండి: హీరోయిన్ నివేదా థామస్‌కు కరోనా పాజిటివ్ )
Comments
Please login to add a commentAdd a comment