‘3 ఇడియట్స్’ మూవీ సయమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని నటుడు ఫజల్ అలీ తాజాగా వెల్లడించాడు. 2009లో వచ్చిన ఈ చిత్రంలో అలీ ఆత్మహత్యకు పాల్పడిన కాలేజీ స్టూడెంట్ పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ ఈ విడుదల అనంతరం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ‘3 ఇడియట్స్ సినిమా చేస్తున్న సమయంలో నేను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోయా. 3 ఇడియట్స్‌లో నా పాత్ర చాలా చిన్నదే అయినా అది తీవ్ర ప్రభావం చూపింది’ అని పేర్కొన్నాడు.
‘ఎందుకంటే ఈ మూవీలో నేను డీన్ పైనల్ ప్రాజెక్ట్ సబ్‌మిషన్ గడువును పెంచెందుకు నిరాకరించడంలో ఆత్మహత్య చేసుకునే విద్యార్థి పాత్ర పోషించాను. అదే సమయంలో బయట కొంత మంది విద్యార్థులు కూడా ఇలాంటి సంఘటనల కారణంగా ఆత్మహత్యకు పాల్పడటంతో న్యూస్ ఛానల్ వాళ్లు నాకు ఫోన్ చేయడం ప్రారంభించారు. పలు ఛానల్స్ నాకు ఫోన్ చేసి సర్ 3 ఇడియట్స్ మూవీలో మీరు చేసినట్లుగా కొంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై మీ అభిప్రాయం చెప్పాలని, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు’ అంటూ ఫోన్ చేసి రకరకాల ప్రశ్నలతో వేసి వేధించారని చెప్పాడు.
ఇక ‘ఈ సంఘటన కారణంగా చాలా ఒత్తిడికి లోనయ్యా. ఎంతో నిరాశకు గురయ్యాను’ అని తెలిపాడు. ఇక ఆ తర్వాత వారితో ప్లీజ్ ఇలా చేయకండని, నిర్మాతతో మాట్లాడండని వారితో చెప్పానని అలీ వివరించాడు. కాగా అమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషీ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీని డైరెక్టర్ రాజ్‌కుమార్ హీరానీ భగత్ చేతన్ నవల్ నుంచి తీసుకుని తెరకెక్కించాడు. 2009లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఫీమేల్ లీడ్ రోల్‌లో కరిష్మా కపూర్ నటించింది. అయితే హిందీలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీ ఫజల్ ఇటీవల ‘రే’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. త్వరలో ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
చదవండి:
వాళ్లు నన్ను మోసం చేశారు: నటి షబానా అజ్మీ
‘అవికా-మనీశ్‌లకు సీక్రెట్ బిడ్డ’: స్పందించిన నటుడు
Comments
Please login to add a commentAdd a comment