బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదిచుకుంది.కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడింది.రీసెంట్‌గానే తన ప్రెగ్నెన్సీ న్యూస్‌ను షేర్ చేసుకుంది. అయితే గర్భంతో ఉన్నా క్షణం తీరిక లేకుండా సినిమాలు, ప్రమోషన్స్ అంటూ బిజీబిజీగా గడిపేస్తుంది.
వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉండే ఆలియా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా రెండు చేతులా బాగానే సంపాదిస్తుంది. 68.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఆలియా షేర్ చేసే ఒక్కో పోస్ట్ చాలా ఖరీదైంది. ఆమె ప్రమోట్ చేసే వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఒక్కో పోస్టుకు ఏకంగా రూ.85 లక్షలు నుంచి రూ.కోటి వరకు చార్జ్ చేస్తుందట.
అంతేకాకుండా బ్రాండ్ వ్యాల్యూను బట్టి ఈ రేటును ఇంకాస్త పెంచుతుందని తెలుస్తోంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆలియా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. చదవండి: తొలిసారిగా బేబీ బంప్‌ను చూపించిన ఆలియా భట్
Comments
Please login to add a commentAdd a comment