ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్‌లో వచ్చిన క్రేజీ చిత్రం 'పుష్ప: ది రైజ్'. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా హిందీలో అంచనాలను మించి కలెక్షన్లు రాబడుతోంది. పుష్ప రిలీజై 20 రోజులు గడుస్తోంది. అయిన ఈ కలెక్షన్ల సునామి అగడం లేదు. ఇందులో బన్నీ పుష్ప రాజ్‌గా నటించాడు అనడం కంటే జీవించాడని చెప్పాలి.
చదవండి: Sanjjanaa Galrani: విడాకులపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
అంతగా ఈ స్టైలిస్ స్టార్ తన నటనతో అందరిని ఫిదా చేశాడు. చెప్పాలంటే పుష్పలో అల్లు అర్జున్ నటనను వన్ మ్యాన్ షో అనోచ్చు అనేంతగా పుష్ప రాజ్‌గా బన్నీ ఒదిగిపోయాడు. దీంతో బన్నీ నటనకు ప్రేక్షకులతో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఫిదా అయ్యాడు. అందుకు అతడిని పోగడకుండ ఉండలేకపోయిన మహేశ్ బాబు బుధవారం ట్వీట్ చేస్తూ బన్నీపై ప్రశంసంలు వర్షం కురింపించాడు.
చదవండి: సెన్సేషనల్.. 'పుష్ప'పై మహేశ్‌బాబు రివ్యూ
‘పుష్పగా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్, ఒరిజినల్, సెన్సేషనల్‌గా ఉంది. అత్యద్భుతంగా నటించాడు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, పచ్చిగా, నిజాయితీగా ఉంటాయో సుకుమార్ మరోసారి నిరూపించాడు' అని చెప్పుకొచ్చాడు. అలాగే 'పుష్ప'కు పని చేసిన టెక్నీషియన్ల గురించి మరో ట్వీట్ చేశాడు. ఇక మహేశ్ చేసిన ట్వీట్‌పై అల్లు అర్జున్ స్పందిస్తూ ఆయనకు థ్యాంక్స్ చెప్పాడు. ‘థ్యాంక్యూ వెరీ మచ్ మహేశ్ బాబు గారూ.. పుష్ప సినిమా బృందం అందరి పని తీరును మీరు మెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా హృదయాలను గెలుచుకున్న అభినందన’ అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చాడు.
Thank you very much @urstrulyMahesh garu . So glad u liked the performance , everyone’s work and the world of #Pushpa. Heart warming compliment . Humbled 🖤
— Allu Arjun (@alluarjun) January 5, 2022
Comments
Please login to add a commentAdd a comment