ప్రముఖ నిర్మాత దిల్ రాజు మనవరాలు ఇషిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం గ్రాండ్‌గా జరిగిన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సినీ స్టార్స్ హాజరయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డితో కలిసి ఈ ఫంక్షన్‌కు వెళ్లాడు. భార్యాభర్తలిద్దరూ బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో పార్టీకి అటెండ్ అవగా దిల్ రాజు వారికి ఆత్మీయ స్వాగతం పలికాడు. ఇంతలో దిల్ రాజు మనవడు కనిపించడంతో అతడిని ప్రేమగా ముద్దాడాడు బన్నీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బన్నీ లుక్ చూసిన ఫ్యాన్స్.. స్టైలిష్ అన్న పదానికి నువ్వు వంద శాతం న్యాయం చేస్తావన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ చివరగా పుష్ప సినిమాలో నటించాడు. 2021 డిసెంబర్‌లో విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. దీంతో దీన్ని ఇటీవలే రష్యాలో రిలీజ్ చేయగా అక్కడ కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాపై ఫోకస్ పెట్టాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
STYLISH ICON @AlluArjun & #AlluSnehaReddy ULTRA STYLISH Clicks From Producer #DilRaju's Grand Daughter Birthday Bash ❤️🤩#AlluArjun - One & Only STYLISH STAR 🤩🔥#AlluArjun𓃵 #Pushpa #PushpaTheRise #PushpaTheRule pic.twitter.com/x07U09ETvm
— Praveen 🪓 ™ (@_AlluBoyPraveen) January 6, 2023
Comments
Please login to add a commentAdd a comment