బర్త్‌ డే స్పెషల్‌ | Allu Arjun Upcoming Movie With Atlee, Teaser And Other Updates On The Occasion Of Birthday On April 8th | Sakshi
Sakshi News home page

Allu Arjun Updates: బర్త్‌ డే స్పెషల్‌

Mar 24 2026 2:50 AM | Updated on Mar 24 2026 1:28 PM

Allu Arjun upcoming movie updates

అల్లు అర్జున్   హీరోగా అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్   తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఆయన లుక్‌ సరికొత్తగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో ఇప్పటికే హీరోయిన్‌ దీపికా పదుకొనె భాగం కాగా, జాన్వీకపూర్, మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా  నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

ఎందుకంటే... ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్   బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేయాలనే దిశగా అట్లీ అండ్‌ టీమ్‌ వర్క్‌ చేస్తున్నారని సమాచారం. ఈ టీజర్‌లోనే టైటిల్‌ కూడా ఉంటుందని టాక్‌. అంతే కాదు.. అల్లు అర్జున్  , దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్  లోని సినిమా అప్‌డేట్స్‌ కూడా ఏప్రిల్‌ 8న బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. మరి.. వచ్చేనెల 8న అల్లు అర్జున్   సినిమాల గురించి ఎలాంటి అప్‌డేట్స్‌ వస్తాయనే ఆసక్తి ఆయన ఫ్యాన్స్‌లో నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement