
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో జాన్ అబ్రహాం నటించిన లేటెస్ట్ మూవీ 'సత్యమేవ జయతే 2'. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్య కోశ్లా కుమార్, రాజీవ్ పిళ్లై, అనుప్ సోని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 26న రిలీజైన థియేటర్‌లో రిలీజైన ఈ సినిమా నెలరోజుల్లోనే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రేపటి (డిసెంబర్ 23) నుంచి స్ట్రీమింగ్ అవనుంది. ఒక్క భారత్‌లోనే కాకుండా 240కి పైగా దేశాల్లో సత్యమేవ జయతే 2 చిత్రం అందుబాటులోకి రానుంది. నిజానికి థియేటర్‌లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే ఉండి చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment