Amitabh Bachchan Shocking Comments on Virat Kohli Over His Instagram Followers - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అమితాబ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published Mon, Dec 13 2021 9:00 AM | Last Updated on Mon, Dec 13 2021 10:11 AM

Amitabh Bachchan Shocking Comments On Virat Kohli Over Instagram Followers - Sakshi

Amitabh Bachchan Shocking Comments On Virat Kohli: బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ ముందు తను దిగదుడుపే అంటూ సోషల్‌ మీడియా వేదికగా షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఆదివారం అమితాబ్‌ ఓ ఫొటో షేర్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఇది వేసుకుని చూడమంటూ నాకు ఆమె ఇచ్చింది. వేసుకున్నాను. చూసుకున్నాను. ఇప్పుడు మీకోసం షేర్‌ చేస్తున్నా. ఇదే ఈ పోస్ట్‌ వెనకాల ఉన్న కథ.  

చదవండి: వైరల్‌ అవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ హాంపర్‌, అందులో ఏం ఉన్నాయంటే..

ఇదంత కాదు. అసలు నిజం ఏంటంటే.. దీనికి కారణం సంఖ్యలు. ఈ సంఖ్యల మధ్య ఇప్పటికీ దూరంగా ఉంది. 160 మిలియన్‌ ప్లస్‌తో విరాట్‌ కోహ్లి నాకంటే అధికంగా ఉన్నాడు. ఈ విషయంలో విరాట్‌ నాకంటే చాలా శక్తివంతుడు. నాది చూడండి 29 మిలియన్ల ఎక్కడా? 160 మిలియన్ల ఎక్కడా?’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌కు తనకంటే ఎక్కువగా ఫాలోవర్స్‌ ఉన్నారంటూ చెప్పకనే చెపుకొచ్చాడు అమితాబ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. తనకంటే కోహ్లి శక్తివంతుడంటూ చెప్పుకొచ్చిన బిగ్‌బి పోస్ట్‌పై విరాట్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement