Viral Video: Jabardasth Anchor Anasuya Bharadwaj Enjoying Vacation In Italy Trip - Sakshi
Sakshi News home page

ఇటలీలో అనసూయ వయ్యారాలు.. వీడియో వైరల్‌

Published Sat, Mar 20 2021 11:19 AM | Last Updated on Sat, Mar 20 2021 1:45 PM

Anasuya Bharadwaj Instagram Video Goes Viral - Sakshi

అనసూయ భరద్వాజ్‌..ఈ పేరు తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరపై పలు షోలు చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ అందాల యాంకరమ్మ. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఒకవైపు యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారు. క్ష‌ణం సినిమాతో వెండితెరకు పరిచమైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చకుంది. ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లంలో రంగమ్మత్తగా నటించి అందరి మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ థ్యాంక్ యూ బ్రదర్ సినిమాలో నటిసస్తుంది. వీటితో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండ, రవితేజ హీరోగా వస్తోన్న ‘ఖిలాడి’లోనూ కీలక పాత్రలో నటిస్తుంది.

ఇక ఈ అందాల యాంకరమ్మ సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో అనసూయ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అనసూయ తన అందాలతో అదరగొట్టింది. ‘నీలి ఆస్మా’ అనే పాపులర్ హిందీ పాటకు స్లోమోషన్‌లో నడుతూ వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఆమె రవితేజ ఖిలాడి సినిమా కోసం ఇటలీ వెళ్లింది. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఓ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  అనసూయ  వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement