
బుల్లితెరపై యాంకర్‌గా అదరగొడుతోంది రష్మీ గౌతమ్. తన అందంతో కుర్రకారును బుట్టలో పడేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ మీమ్ క్లిప్పింగ్ షేర్ చేసింది.
'టాప్ స్థానానికి చేరుకునేందుకు ఆమె కచ్చితంగా అందరితో బెడ్ షేర్ చేసుకుందని అంటుంటారు' అన్న మీమ్ క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ.. 'అవును, చాలామంది ఎంతో సులువుగా ఆ మాట అనేస్తుంటారు' అని రాసుకొచ్చింది. కాగా ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు తరచూ వినిపిస్తున్న విషయం తెలిసిం కాగా రష్మీ పలు టీవీ షోలతో పాటు అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. నటుడు నందుతో కలిసి బొమ్మ బ్లాక్‌బస్టర్ అనే మూవీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment