
బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా అనసూయతో పోటీ పడుతుంది యాంకర్ రష్మీ. ఒకవైపు పలు షోలకు యాంకర్‌గా కొనసాగుతూనే.. మరోవైపు సినిమాల్లోనూ దూసుకెళ్తోంది. ఇప్పటికే హీరోయిన్‌గా 'గుంటూరు టాకీస్'తో పాటు రెండు, మూడు చిన్న సినిమాల్లో కూడా నటించింది. తాజాగా ఈ హాట్ బ్యూటీకి పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున చేయబోతున్న సినిమాలో రష్మీ గౌతమ్ నటించే అవకాశం దక్కించుకుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'వైల్డ్ డాగ్' తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ మొదలై కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ తిరి ప్రారంభం కానుంది. ఇందులో రష్మీ గౌతమ్ కీలక పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రష్మీ 'గుంటూరు టాకీస్' చేసింది. ఆ పరిచయం కారణంగానే ఆమెకి ఈ సినిమాలో ఛాన్స్ దక్కిందని చెప్పుకుంటున్నారు.
చదవండి:
లాక్‌డౌన్: తోటపని చేస్తున్న హీరోయిన్
పెళ్లి గురించి చర్చించడం లేదు: మెహ్రీన్
Comments
Please login to add a commentAdd a comment