
ఇంజక్షన్ అంటే చిన్న పిల్లలకే కాదు.. చాలా మంది పెద్దవారికి కూడా విపరీతమైన భయం. కొందరైతే ఏకంగా ఏడుస్తారు. నటి అంకిత లోఖండే కూడా ఇదే కోవలోకి వస్తారు. కోవిడ్ టీకా తీసుకునేటప్పుడు పాపం భయంతో ఏడ్చినంత పని చేశారు అంకిత. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.
"నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను.. ఇక మీ వంతు" అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో అంకితకు నర్స్ వ్యాక్సిన్ వేయడానికి వస్తుంది. టీకా తీసుకునే సమయంలో అంకిత చాలా భయపడుతుంది. ప్లీజ్ నెమ్మదిగా వేయండి అని నర్స్‌ని రిక్వెస్ట్ చేస్తుంది. అంకిత అంతలా భయపడటం చూసి నర్స్ కూడా నవ్వుతుంది. ఇక వ్యాక్సిన్ వేస్తుండగా అంకిత బప్పా.. బప్పా అంటూ దేవుడిని తలచుకుంటు.. ఏడ్చినంత పని చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అంకిత స్నేహితులు, అభిమానులు చాలా ముద్దుగా ఉన్నావ్ అంటూ కామెంట్ చేస్తుండగా.. కొందరు "మాకు కూడా వ్యాక్సిన్ అంటే చాలా భయం" అంటున్నారు నెటిజనులు. కోవిడ్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి టీకా వేయడానికి కేంద్రం అంగీకరించినప్పటికి పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత వల్ల ఇంకా ప్రారంభం కాలేదు.
చదవండి: ఏడాది కూడా ఆగలేకపోయావా అంకితా!
Comments
Please login to add a commentAdd a comment