Ankita Lokhande Father Shashikant Lokhande Father Passed Away - Sakshi
Sakshi News home page

Ankita Lokhande: సుశాంత్‌ సింగ్‌ మాజీ ప్రేయసి, నటి ఇంట తీవ్ర విషాదం..

Published Sun, Aug 13 2023 1:23 PM | Last Updated on Sun, Aug 13 2023 2:28 PM

Ankita Lokhande father Shashikant Lokhande Father Passed Away - Sakshi

బాలీవుడ్‌ నటి అంకిత లోఖండే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి శశికాంత్‌ లోఖండే(68)శనివారం కన్నుమూశారు. తండ్రి మరణంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆదివారం ఉదయం శశికాంత్‌ అంత్యక్రియలు జరగ్గా అంకిత తండ్రి పాడె మోసింది. తండ్రిని తలుచుకుని ఆమె భావోద్వేగానికి లోనవుతుండగా భర్త విక్కీ జైన్‌ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతుండగా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరీ అంకిత?
ఇండోర్‌లో జన్మించిన అంకితకు నటనంటే ఆసక్తి. తన కలను సాకారం చేసుకునేందుకు 2005లో ముంబైకి వచ్చింది. అవకాశాలు వెతుక్కునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. రూమ్‌ రెంట్‌ కట్టడానికి డబ్బుల్లేని సమయంలో తండ్రే తనను ప్రోత్సహిస్తూ డబ్బులు సమకూర్చేవాడు. మొదట 'టాలెంట్‌ హంట్‌' రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్తా' సీరియల్‌లో నటించింది. ఈ ధారావాహికతో ఆమెకు పెద్ద బ్రేక్‌ వచ్చింది.

సుశాంత్‌తో బ్రేకప్‌
ఈ సీరియల్‌ షూటింగ్‌ సమయంలో సహనటుడు సుశాంత్‌ సింగ్‌తో ప్రేమలో పడింది. ఆరేళ్ల పాటు సుశాంత్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. సుశాంత్‌తో బ్రేకప్‌ తర్వాత మరో బాలీవుడ్‌ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది. మూడేళ్ల డేటింగ్‌ తర్వాత 2021 డిసెంబర్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అంకిత 'మణికర్ణిక','బాఘీ 3' సినిమాలు చేసింది.

చదవండి: టాప్‌ హీరోయిన్‌.. 18 ఏళ్లకే హీరోయిన్‌.. పెళ్లైన డైరెక్టర్‌తో ప్రేమే కొంప ముంచిందా? గదిలో శవమై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement