Anushka Shetty Celebrates 17 Years Anniversary In Film Industry Shares Post - Sakshi
Sakshi News home page

Anushka Shetty: ఎట్టకేలకు సెట్‌లో అడుగుపెట్టిన స్వీటీ.. ‘17 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ..’

Published Fri, Jul 22 2022 12:55 PM | Last Updated on Fri, Jul 22 2022 1:45 PM

Anushka Shetty Celebrates 17 Years Anniversary In Film Industry Shares Post - Sakshi

దక్షిణాదిలో స్టార్‌ హీరోలకు సమానంగా క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్‌ అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో మోస్ట్‌ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. నిశ్శబ్దం మూవీ తర్వాత మరో సినిమాకు సంతకం చేయలేదు. ఆమె వెండితెరపై కనిపించక మూడేళ్లు అవుతోంది. ఇప్పటికి స్వీటీ పలు సినిమాలకు సంతకం చేసిందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆమె సెట్స్‌లో అడుగు పెట్టింది లేదు. ఇక ఆమె రీఎంట్రీ ఎప్పుడా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో తన ఫ్యాన్స్‌కు స్వీటీ గుడ్‌న్యూస్‌ చెప్పంది. ఎట్టకేలకు ఆమె సెట్‌లో అడుగుపెట్టింది.

చదవండి: కాఫీ విత్‌ కరణ్‌: టాలీవుడ్‌ నెపోటిజంపై సమంత ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

అంతేకాదు అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం ఆమెతో కేక్‌ కట్‌ చేయించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా అనుష్క తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది. దీంతో ఆమె పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘17 ఏళ్ల ఈ ప్రయాణంలో సినీ ఇండస్ట్రీ, ఫ్యామిలీ, వెల్‌ విషర్స్‌  నుంచి అమితమై ప్రేమ, మద్దతు లభించాయి. వారంత నా జీవితంలో ఒక పార్ట్‌గా నిలిచారు. వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇక ఫ్యాన్స్‌ విషయానికి వస్తే వారి గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు. వారి అన్‌కండీషనల్‌ లవ్‌, సర్‌ప్రైజ్‌ అనంతమైనది’ అంటూ రాసుకొచ్చింది. కాగా స్వీటీ ప్రస్తుతం యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే మూవీ సెట్‌లో ఆమె పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

చదవండి: ఓటీటీ హావా.. ఈ ఒక్క రోజే ఏకంగా 13 సినిమాలు సందడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement