Megastar Chiranjeevi Tweet On Ap Movie Ticket Prices: ఆంధ‍్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లను సవరించడంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలుగు సినీ పరిశ‍్రమ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
'తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ గారికి పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు' అంటూ చిరంజీవి రాసుకొచ్చారు.
చదవండి: సినిమా టిక్కెట్ల ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
చిన్న సినిమాకు ఐదో షో కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశమని చిరంజీవి పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని, అధికారులు, కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, మూడు కేటగిరీల్లో 4 రకాలుగా సినిమా టికెట్ల రేట్లను ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కనిష్టంగా రూ. 20, గరిష్టంగా రూ. 250 ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టికెట్ల ధరలను పెంచాలని కోరుతూ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఇదివరకు కలిసిన విషయం తెలిసిందే.
Thank you Sri. @ysjagan garu @AndhraPradeshCM pic.twitter.com/BsvmsEPrxt
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2022
Comments
Please login to add a commentAdd a comment