డబ్ స్మాష్‌తో జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకుంది అషూ రెడ్డి. టిక్‌టాక్‌తో మరింత ఫేమస్ అయిన ఆమె బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. అటు బుల్లితెర షోలతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ అల్లరి చేసే అషూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఇందులో ఏముందంటారా?
మరేం లేదు, అషూ తన తల్లిని ఆటపట్టించి అక్షింతలు వేయించుకుంది. ఓ హ్యాండ్ బ్యాగ్‌ను చూపిస్తూ లక్షన్నర పెట్టి కొన్నానని చెప్పింది. అది అంత ఖరీదు చేస్తుందా? అని ఆశ్చర్యపోయిన ఆమె నిజం చెప్పు అంటూ కూతురిని రెట్టించి అడిగింది. నిజమేనని అషూ చెప్పడంతో ఆమె తల్లి అగ్గి మీద గుగ్గిలమైంది. హ్యాండ్ బ్యాగ్‌ను విసిరికొట్టింది. ఇప్పటికే ఎన్నో ఉండగా మళ్లీ ఇదెందుకు అంటూ కోప్పడింది. కానీ ఆమె కోపాన్ని ఏమాత్రం పట్టించుకోని అషూ పడీపడీ నవ్వింది. ఈ బ్యాగ్ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని చెప్పాను, కానీ ఇది నాకు బహుమతిగా వచ్చిందంటూ అసలు విషయం చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment