
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు యూట్యూబ్‌లో అధిక వీక్షణలతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో నాలుగో సాంగ్ రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఆయుధ పూజ వాయిదా
రేపు ఉదయం 11.07 గంటలకు ఆయుధ పూజ పాట విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఇంతలోనే దేవర టీమ్ మనసు మార్చుకుంది. ఆయుధ పూజను అంత ఈజీగా ముందుకు తీసుకురావడానికి మనసొప్పుకోవడం లేదంది. ఆయుధ పూజను మరింత ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని, కనుక రేపు ఈ సాంగ్ రిలీజ్ చేయడం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ప్రోమో వదిలినా బాగుండేది
అయితే ఎదురుచూపులకు తగ్గ ఫలితాన్ని కచ్చితంగా అందిస్తామని పేర్కొంది. ఇది చూసిన కొందరు కనీసం ప్రోమో అయినా వదిలితే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. రేపు రిలీజ్ చేయడం లేదంటే డైరెక్ట్‌గా థియేటర్‌లో రిలీజ్ చేస్తారేమోనని అభిప్రాయపడుతున్నారు. అయినా రిలీజ్ డేట్ ప్రకటించాక ఇలా మాట తప్పడం అస్సలు బాగోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
#AyudhaPooja is a MADNESS that deserves to be celebrated to the fullest. The song won't be releasing tomorrow.
We’ll bring you the SAME HIGH you’ve been waiting for!#Devara #DevaraOnSep27th— Devara (@DevaraMovie) September 18, 2024
You’re on steroids man 🫡🔥
Everyone will go wild tomorrow! ❤️❤️#AyudhaPooja #Devara https://t.co/VrGva4DWYZ— Devara (@DevaraMovie) September 18, 2024