Bhojpuri Actor Pawan Singh Divorce Case: భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్, ఆయన భార్య జ్యోతి సింగ్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని అరా ఫ్యామిలీ కోర్టు తేల్చి చెప్పింది. అక్టోబర్ 9, 2021న పవన్ విడాకుల కోసం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన కోర్టు మే 26కు వాయిదా వేసింది. తదుపరి విచారణలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని సూచించింది. అయితే ఈ విచారణ ఏప్రిల్ 28న జరగాల్సింది. కానీ పలు కారణాల వల్ల పవన్ సింగ్ కోర్టుకు హాజరుకాకపోవడంతో మే 26కు వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇంతకుముందు విడాకుల గురించి పవన్ మాట్లాడుతూ 'నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు. నాకు తనతో జీవించడం ఇష్టం లేదు. డివోర్స్ కావాలి.' అని తెలిపాడు. దీతో అతడి భార్య జ్యోతిసింగ్ కూడా పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక జ్యోతిసింగ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ 'జ్యోతికి పవన్ సింగ్ రెండు సార్లు అబార్షన్ చేయించారు. పెళ్లయిన తర్వాత నిత్యం భార్యను కొట్టడంతోపాటు చిత్రహింసలు పెట్టేవాడు. అదితట్టుకోలేక గత కొన్ని నెలలుగా జ్యోతిసింగ్ తన తల్లి ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి పవన్ సింగ్ నుంచి విడాకులతోపాటు మధ్యంతర భరణం కూడా ఇప్పించాలి' అని కోర్టును కోరారు.
చదవండి: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎన్సీబీ క్లీన్ చిట్..
ఇదిలా ఉంటే పవన్ సింగ్ మొదటి భార్య నీలం సింగ్ మనస్పర్థల కారణంగా మార్చి 8, 2015న ముంబైలోని ఒక ఫ్లాట్‌లో ఆత్యహత్య చేసుకుంది. తర్వాత కొద్ది రోజులకు పాపులర్ నటి అక్షరా సింగ్‌తో పవన్ సింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. మార్చి 7, 2018న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన జ్యోతిసింగ్‌ను వివాహం చేసుకుని అందరిని షాక్‌కు గురి చేశాడు పవన్ సింగ్.
చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్
Comments
Please login to add a commentAdd a comment