బిగ్‌బాస్ 6 షోలో అందరికీ వంట చేసి పెట్టింది సుదీప. అంతేనా, అందరినీ కమాండ్ చేస్తూ బాస్ లేడీ అన్న ట్యాగ్‌ను కూడా సంపాదించింది. ఆరోవారంలో షో నుంచి ఎలిమినేట్ అయిన పింకీ బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ అయింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
'నా మొదటి సినిమా యమ్.ధర్మరాజు ఎమ్‌ఏ. ఈ సినిమా రచయిత వేమూరి సత్యానారాయణతో మా తాతగారికి పరిచయం ఉంది. ఈ మూవీ కోసం చెన్నై నుంచి తీసుకువచ్చిన వచ్చిన అమ్మాయి సమయానికి చేయనంది. రాజమండ్రిలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుందంటే చూడటానికి వెళ్లినప్పుడు మా మనవరాలికి ఇంట్రస్ట్ ఉంది, ఏదైనా పాత్ర ఉంటే చెప్పండని తాతగారు అన్నారు. అలా చెన్నై అమ్మాయి హ్యాండివ్వడంతో నన్ను తీసుకున్నారు. సినిమా చాలా పెద్ద హిట్టయింది.
7జి బృందావన కాలనీ కోసం నల్లగా ఉండాలి, సన్నబడాలన్నారు. అందుకోసం రోజూ ఒక గంటసేపు ఎండలో నిలబడేదాన్ని. ఆ తర్వాత ఉదయ్ కిరణ్‌వి 9 సినిమాలు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. అందులో ఐదింటికి నేను సంతకం చేశా.. కానీ చాలా చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. అతడు చాలా సాఫ్ట్‌గా ఉంటాడు. మనం కొంచెం డల్‌గా కనిపిస్తే వెంటనే వచ్చి ఏమైంది? ఏం జరిగింది, ఏదైనా ఇబ్బందా? అని అడిగే తత్వం తనది. సంతోషాన్ని పంచుకోకపోయినా బాధను పసిగట్టి ఓదార్చే మనిషి. అతడితో నేను చేసిన చివరి చిత్రం వియ్యాలవారి కయ్యాలు. ఏ కష్టం వచ్చిందో ఆత్మహత్య చేసుకుని అందరినీ వదిలేసి వెళ్లాడు. కానీ ప్రజల మనసులో మాత్రం శాశ్వతంగా నిలిచిపోయాడు' అని ఎమోషనలైంది సుదీప.
చదవండి: పవిత్ర నరేశ్ బ్రేకప్, ఏమైందంటే?
కన్ఫ్యూజన్ మాస్టర ఎలిమినేట్
చేదు అనుభవం, కెరీర్ ముగిసిపోయిందనుకున్నా
Comments
Please login to add a commentAdd a comment