Bigg Boss 6 Telugu Launch Updates: Vasanthi Krishnan Entered As BB6 13th Contestant - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu Contestants: 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన వాసంతీ కృష్ణన్‌

Published Sun, Sep 4 2022 8:19 PM | Last Updated on Mon, Nov 14 2022 4:08 PM

Bigg Boss 6 Telugu: Vasanthi Krishnan Entered As 13th Contestant - Sakshi

Vasanthi Krishnan  In Bigg Boss 6 Telugu: మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన వాసంతీ కృష్ణన్‌ తొలుత కన్నడ సినిమాల్లో నటించింది. సిరిసిరి మువ్వలు సీరియల్‌తో టాలీవుడ్‌కు పరిచయం అయిన వాసంతి ఆ తర్వాత సంపూర్ణేష్ బాబుతో కలిసి క్యాలీఫ్లవర్ సినిమాలో నటించింది. ఈ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవలె దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండుగాడు' చిత్రంలో నటించింది.

ఈమె కెరీర్‌కు బిగ్‌బాస్‌-6 ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది. తన పేరు పక్కన కృష్ణన్‌ ఉండేసరికి తనకి పెళ్లయిందని అనుకుంటున్నారని, కానీ తాని​ంకా సింగిల్‌ అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తన డ్రీమ్‌బాయ్‌ అంటే చాలా నిజాయితీగా ఉండాలని అబ్బాయిలే ఆ క్వాలిటీ తనకు నచ్చుతుందని చెప్పింది. మరి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరితో అయినా మింగిల్‌ అవుతుందేమో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement