పల్లవి ప్రశాంత్‌(విన్నర్‌) | Bigg Boss 7 Telugu: Pallavi Prashanth Entered as 13th Contestant | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: డబ్బు లాక్కుని మోసం చేశారు, చచ్చిపోదామనుకున్నా.. పల్లవి ప్రశాంత్‌

Published Sun, Sep 3 2023 10:07 PM | Last Updated on Tue, Dec 19 2023 1:19 PM

Bigg Boss 7 Telugu: Pallavi Prashanth Entered as 13th Contestant - Sakshi

వ్యవసాయం అంటేనే ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఓ యువకుడు మాత్రం దాన్నే నమ్ముకున్నాడు. ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వ్యవసాయాన్ని వదిలిపెట్టేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. అతడే యువ రైతు పల్లవి ప్రశాంత్‌.. తను చేసే ప్రతి పనిని వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌  చేస్తూ ఉంటాడు. రైతు బిడ్డను అన్నా.. అంటూ ప్రతిసారి ఎమోషనల్‌ వీడియోలు చేస్తుంటాడు పల్లవి ప్రశాంత్‌. బిగ్‌బాస్‌కు వెళ్లాలనేది తన కల అని నిత్యం చెప్తూ ఉండే ఇతడు ఎట్టకేలకు ఆ కోరిక నెరవేర్చుకున్నాడు. కామన్‌ మ్యాన్‌ కేటగిరీలో బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టాడు. షోలో పార్టిసిపేట్‌ చేయాలన్న కల నెరవేర్చుకున్నాడు, అక్కడివరకు బానే ఉంది.. కానీ హౌస్‌లో కూడా సింపథీ ప్లాన్‌ వర్కవుట్‌ చేయాలనుకుంటే మాత్రం కష్టమే.. మరి ఇతడి గేమ్‌ ఎలా ఉండబోతుందో రానున్న రోజుల్లో తేలనుంది.

'ఉద్యోగం చేయాలంటే ఒకరి కింద బతకాలి.. కానీ ఇక్కడ పని చేసుకుంటే నేను, నా కుటుంబం బతుకుతుంది. నలుగురి కడుపు నింపుతామన్న సంతోషం ఉంటుంది. ఫోక్‌ సాంగ్స్‌ చేస్తే దాని ద్వారా వచ్చిన డబ్బు నా స్నేహితులు తీసేసుకుని మోసం చేశారు. నేను చచ్చిపోతా అంటే మా నాన్న కూడా చచ్చిపోతా అన్నాడు. అప్పుడే నేను సోషల్‌ మీడియాలో వీడియోలు పెట్టడం మొదలుపెట్టాను. కొందరు ఎంకరేజ్‌ చేశారు, మరికొందరు ఎగతాళి చేశారు. బిగ్‌బాస్‌ కోసం ఒక అడుగు ముందుకేశా. రైతుబిడ్డగా గర్వపడుతున్నా' అన్నాడు పల్లవి ప్రశాంత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement