బిగ్‌బాస్ విన్నర్‌ ఇంట తీవ్ర విషాదం | Bigg Boss 7 Winner Gauhar Khan Father Is No More | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ విన్నర్‌ తండ్రి మృతి, నటి భావోద్వేగం

Published Fri, Mar 5 2021 10:13 PM | Last Updated on Sat, Mar 6 2021 4:40 AM

Bigg Boss 7 Winner Gauhar Khan Father Is No More - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి, మోడల్‌ గౌహర్‌ ఖాన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జాఫర్‌ అహ్మద్‌ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు లోనై మరణించారు. కోలుకొని తిరిగొస్తాడనుకున్న తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో గౌహర్‌ ఖాన్‌ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ లేఖను పంచుకుంది.

నువ్వు నా హీరో. నీలా ఎవరూ ఉండలేరు. మా నాన్న చనిపోయారు. ఆయన ఒక ఒక దేవదూతగా వెళ్లిపోయారు. ఐ లవ్‌ యూ సోమచ్‌ పప్పా.. మీరు నాలోనే ఉన్నారు.మై ఫరెవర్‌ షైనింగ్‌ స్టార్‌ అంటూ తండ్రి ఫొటోను షేర్‌ చేసింది. తన పెళ్లిలో తండ్రి ఆప్యాయంగా ముద్దు పెడుతున్న ఫొటోను సైతం ఇటీవలే పోస్ట్‌ చేసింది. కాగా ఈ బాలీవుడ్‌ నటి, కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌ను డిసెంబర్‌ 25న పెళ్లాడింది. 

చదవండి: ఉదయ్‌పూర్‌లో తాండవ్‌ నటి హనీమూన్‌

రోడ్డు ఏమైనా నీ సొంతమా.. మలైకపై ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement