Zafar Khan
-
బిగ్‌బాస్ విన్నర్ ఇంట తీవ్ర విషాదం
ముంబై: బాలీవుడ్ నటి, మోడల్ గౌహర్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జాఫర్ అహ్మద్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు లోనై మరణించారు. కోలుకొని తిరిగొస్తాడనుకున్న తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో గౌహర్ ఖాన్ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ లేఖను పంచుకుంది. View this post on Instagram A post shared by GAUAHAR KHAN (@gauaharkhan) నువ్వు నా హీరో. నీలా ఎవరూ ఉండలేరు. మా నాన్న చనిపోయారు. ఆయన ఒక ఒక దేవదూతగా వెళ్లిపోయారు. ఐ లవ్ యూ సోమచ్ పప్పా.. మీరు నాలోనే ఉన్నారు.మై ఫరెవర్ షైనింగ్ స్టార్ అంటూ తండ్రి ఫొటోను షేర్ చేసింది. తన పెళ్లిలో తండ్రి ఆప్యాయంగా ముద్దు పెడుతున్న ఫొటోను సైతం ఇటీవలే పోస్ట్ చేసింది. కాగా ఈ బాలీవుడ్ నటి, కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్‌ను డిసెంబర్ 25న పెళ్లాడింది. చదవండి: ఉదయ్‌పూర్‌లో తాండవ్ నటి హనీమూన్ రోడ్డు ఏమైనా నీ సొంతమా.. మలైకపై ట్రోలింగ్ -
బహిర్భూమికెళితే ఫొటోలు తీస్తారా?
జైపూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ‘స్వచ్చ్ భారత్ అభియాన్’ పథకాన్ని అమలు చేయడంలో బాగా వెనకబడి పోయిన రాజస్థాన్‌లో పథకాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ముఖ్యమంత్రి వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. తరతరాలుగా ఇంటి వెలుపల బహిర్భూమికి వెళ్లే అలవాటున్న రాష్ట్రంలో ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలంటే అలా బహిర్భూమికి వెళ్లే వాళ్ల ఫొటోలు తీయాలని, వారెవరే గుర్తించి అవమానపర్చాలని గతేడాది ఆమె ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో మున్సిపల్ కమిషనర్ అశోక్ జైన్ ఆధ్వర్యంలో ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులు శుక్రవారం ఉదయం ఆరున్నర గంటలకు బహిర్భూమికి వెళుతున్న మహిళల ఫొటోలు తీశారు. అసభ్యంగా ఇలా ఫొటోలు తీయడం ఏమిటంటూ సీపీఎం (ఎంఎల్)కు చెందిన 52 ఏళ్ల జఫర్ ఖాన్ అడ్డుకుంటే ఆయన్ని కొట్టారు. దాంతో ఆయన మరణించడంతో ఇప్పుడు రాద్ధాంతం జరుగుతోంది. ఆరుబయట బహిర్భూమికి వెళ్లడం సరైన సంస్కృతి కాదని, అయితే అలాంటప్పుడు మహిళలను ఫొటోలు తీయడం ఏ సంస్కృతని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని 22 శాతం ఇళ్లకు ఇంకా టాయ్లెట్లు లేనప్పుడు వారంతా ఎక్కడికెళ్లాలలని ప్రశ్నిస్తున్నారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా 80 లక్షల టాయ్లెట్లను నిర్మించామని, అందులో రాజస్థాన్‌లోనే ఎక్కువ నిర్మించామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ రాజస్థాన్ ప్రభుత్వం స్వచ్ఛతలో దారుణంగా వెనకబడి ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశంలోని 434 నగరాలో ‘స్వచ్చ్ సర్వేక్షన్ (సర్వే)–2017’ పేరిట నిర్వహించిన సర్వేనే తెలియజేస్తోంది. రాజస్థాన్‌లోని కిషాన్గఢ్ 419వ స్థానంలో ఉండగా, 29 నగరాలకుగాను 18 నగరాలు 300 నగరాలకన్నా వెనకబడ్డాయి. స్వచ్ఛ భారత్‌ను ముందుకు తీసుకెళ్లడం కోసం పంచాయతీలకు పోటీ చేసే అభ్యర్థుల ఇళ్లలో తప్పనిసరిగా టాయ్లెట్లు ఉండాలని, అభ్యర్థి కుటుంబ సభ్యులెవరూ బహిర్భూమికి వెళ్లరాదంటూ పంచాయతీ రాజ్ చట్టంలో వసుంధర రాజె ప్రభుత్వం గతేడాది సవరణను తీసుకొచ్చింది. ఈ సవరణ స్ఫూర్తితో కొంతమంది మహిళా సర్పంచ్‌లు ‘నో టాయ్‌లెట్, నో మ్యారేజ్’ నినాదంతో ప్రచారోద్యం చేపట్టారు. చట్ట సవరణను చిత్తశుద్ధితో అమలు చేస్తూ మహిళా సర్పంచ్‌లు చేపట్టిన ఉద్యమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా అసభ్యంగా ఫొటోలు తీయడం వల్ల దుష్ఫలితాలే ఎక్కువ ఉంటాయని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. -
సభ్యత మరిచి ఫొటోలు తీస్తుంటే అడ్డుకున్నందుకు..
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన మహిళలను ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులను అడ్డుకున్న ఓ 50 ఏళ్ల వ్యక్తిని పెద్ద మనిషి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు. పిడిగుద్దులు కురిపించి కాళ్లతో తన్నారు. దీంతో ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికే ఆ వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. చనిపోయిన ఆ వ్యక్తి కమ్యూనిస్టు నాయకుడిగా తెలిసింది. దీంతో ఈ ఘటనపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ప్రతాప్‌ఘడ్‌లో బాగ్వాసా కాచి బస్తీ ప్రాంతంలో ప్రతాప్‌ఘడ్‌కు చెందిన మున్సిపల్ ఉద్యోగులు ఉదయం 6.30గంటల ప్రాంతంలో పర్యటించారు. ఆ సమయంలో బహిర్భూమికి వెళ్లిన మహిళలను ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఇది చూసిన జాఫర్ ఖాన్(50) అనే కమ్యూనిస్టు నాయకుడు జోక్యం చేసుకోని అలా చేయడం తప్పని వారించే ప్రయత్నం చేశాడు. దీంతో వారు మూకుమ్మడిగా దాడి చేసి కొట్టి అతడు చనిపోయేందుకు కారణమయ్యారు. ఈ దాడికి పాల్పడిన వారిలో నగర్ పరిషద్ కమిషనర్ కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. మొత్తం నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగానే అలా బహిర్భూమికి వెళ్లే వారి ఫొటోలు తీస్తున్నారంట. అలా చేస్తే వారి ఆలోచనలో మార్పు వచ్చి మరుగుదొడ్లు నిర్మించుకుంటారని వారిని ఆలోచన. ఇందులో భాగంగానే చాలా రోజుల నుంచి వారు ఉదయాన్నే కెమెరాలు పట్టుకొని వెళ్లడం ఫొటోలు తీయడం చేస్తుంటే ఇలాంటి చర్యలు తప్పని జాఫర్ ఖాన్ పలు మార్లు ఫిర్యాదు చేశారంట.