Bigg Boss Fame Swetha Varma: Heart is Bleeding, Iam In So Much Pain Post Goes Viral - Sakshi
Sakshi News home page

Swetha Varma: బిగ్‌బాస్‌ బ్యూటీ శ్వేత వర్మకు చేదు అనుభవం, సినిమా ఛాన్స్‌ ఇచ్చినట్టే ఇచ్చి..

Published Sat, Apr 30 2022 9:29 AM | Last Updated on Sat, Apr 30 2022 12:07 PM

Bigg Boss Fame Swetha Varma: Heart is Bleeding, Iam In So Much Pain - Sakshi

బిగ్‌బాస్‌ బ్యూటీ శ్వేత వర్మ సోషల్‌ మీడియాలో భావోద్వేగానికి లోనైంది. తనకు అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నారని ఆవేదన చెందింది. తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్‌ చేసుకుంది. 'చాలా బాధగా ఉంది. నాకు ఛాన్స్‌ ఇచ్చి మళ్లీ వెనక్కు తీసేసుకున్నారు. ఇలా జరగడం నాకు మొదటిసారేమీ కాదు. కానీ నాకు ఆశలు కల్పించి వెంటన్నే ఆ ఆశలపై నీళ్లు చల్లడం భావ్యమా? భరించలేకపోతున్నాను. వారం రోజుల వరకు సోషల్‌ మీడియా నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను' అని చెప్పుకొచ్చింది. కానీ కాసేపటికే ఆ పోస్టును తొలగించింది.

మరి శ్వేతకు వచ్చింది సినిమా ఛాన్సా? ఒకవేళ సినిమా అవకాశమైతే దాన్ని ఎవరు ఆఫర్‌ చేశారు? తర్వాత ఎందుకు మళ్లీ వెనక్కు తీసుకున్నారు? ఇంతకీ ఆమె సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే శ్వేత.. పచ్చీస్‌, రోజ్‌విల్లా, ఏకమ్‌, నెగటివ్‌ సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లోనూ పాల్గొంది.

చదవండి: 8 ఏళ్ల కృషి ఫలించి సుమతో నటించే ఛాన్స్‌ దక్కింది

 ఓ అంతర్జాతీయ చెఫ్‌ పాత్రలో అనుష్క శెట్టి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement