నటరాజ్‌ మాస్టర్‌కు బాలకృష్ణ బంపరాఫర్‌! | Bigg Boss Telugu 5: Nataraj Master Get Chance In Nandamuri Balakrishna Talk Show | Sakshi
Sakshi News home page

Natraj Master: 'ఆహా'లో బాలయ్య టాక్‌ షో, నటరాజ్‌ మాస్టర్‌కు బంపరాఫర్‌

Published Mon, Oct 25 2021 8:00 PM | Last Updated on Sat, Oct 30 2021 11:26 PM

Bigg Boss Telugu 5: Nataraj Master Get Chance In Nandamuri Balakrishna Talk Show - Sakshi

Balakrishna Offer To Nataraj Master

బుల్లితెర బాస్‌ బిగ్‌బాస్‌ షోకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే పలు భాషల్లో ఈ రియాలిటీ షోను పట్టాలెక్కించారు. హిందీలో అయితే ఏకంగా 14 సీజన్లు పూర్తి చేసుకుని 15 వ సీజన్‌ ప్రసారమవుతోంది. తెలుగు, తమిళంలో ఐదో సీజన్‌ రన్‌ అవుతోంది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్‌ తర్వాత గుర్తింపుతో పాటు మంచిమంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఐదో వారం ఎలిమినేట్‌ అయిన నటరాజ్‌ మాస్టర్‌ ఏకంగా నందమూరి బాలకృష్ణ నుంచి బంపర్‌ ఆఫర్‌ పట్టేశాడు.

కాకపోతే ఇది సినిమా ఛాన్స్‌ కాదు! బాలయ్య ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'లో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే' అనే టాక్‌ షో చేస్తున్న సంగతి తెలిసిందే కదా! దీనికి సంబంధించిన ప్రోమోలో బాలయ్య స్టెప్పులు వేయనున్నాడట, దీనికి నటరాజ్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫీ చేస్తున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో కూడా వైరల్‌ అవుతోంది. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement