బిగ్‌బాస్‌ 7: నామినేషన్స్‌లో రైతు బిడ్డ.. ఇంకా ఎవరున్నారంటే? | Bigg Boss Telugu 7: 1st Week Nominations List | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: మొదటి వారం నామినేషన్స్‌లో 8 మంది.. ఎవరెవరంటే?

Published Mon, Sep 4 2023 1:55 PM | Last Updated on Wed, Sep 6 2023 9:46 AM

Bigg Boss Telugu 7: 1st Week Nominations List - Sakshi

బిగ్‌బాస్‌ 7 ఆట మొదలైంది. గతంలో ఎన్నడూ లేనట్లుగా కేవలం 14 మంది కంటెస్టెంట్లతో షో ప్రారంభించారు. మరి మిగతావాళ్లు? అంటారా? కొందరిని ఇంటికి పంపించేయగా మరికొందరిని మాత్రం వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా లోపలకు పంపించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం హౌస్‌లో పదిహేను మంది ఉన్నారు. పద్నాలుగు మంది కంటెస్టెంట్లు కాగా మరొకరు యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి. కంటెస్టెంట్లతో ఏదో ఒక టాస్క్‌ ఆడించి.. నెక్స్ట్‌ బయటకు వచ్చేస్తాడు.

ఇకపోతే బిగ్‌బాస్‌ వాతావరణానికి నెమ్మదిగా అలవాటు పడుతున్నారు కంటెస్టెంట్లు. ప్రతి సీజన్‌లోలాగే ఈ సీజన్‌లోనూ మొదటివారం నామినేషన్స్‌ ఉన్నాయి. ఒక వారం ఆగిన తర్వాత నామినేషన్స్‌ ప్రక్రియ మొదలుపెడితే బాగుంటుందన్నది జనాల అభిప్రాయం. కానీ బిగ్‌బాస్‌ మాత్రం దాదాపు ప్రతి సీజన్‌లోనూ తొలివారం నామినేషన్స్‌ ప్రక్రియను అలాగే కొనసాగిస్తూ వస్తున్నాడు. కొన్నిసార్లు మాత్రం నో ఎలిమినేషన్‌ అని కంటెస్టెంట్లకు బిగ్‌ రిలీఫ్‌ ఇస్తున్నాడు. ఈ సీజన్‌లోనూ నామినేషన్స్‌ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. గౌతమ్‌ కృష్ణ, రతిక, షకీల, పల్లవి ప్రశాంత్‌, శోభా శెట్టి, కిరణ్‌ రాథోడ్‌, ప్రిన్స్‌ యావకర్‌, దామిని భట్ల ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. 

కాగా ఈసారి ఫోన్‌లో పది మిస్‌డ్‌ కాల్స్‌,  హాట్‌స్టార్‌లో పది ఓట్లు వేసే ఛాన్స్‌ లేదు. కేవలం ఒక ఓటు, ఒక మిస్‌డ్‌ కాల్‌ మాత్రమే చేసేందుకు వీలు కల్పించింది బిగ్‌బాస్‌ టీమ్‌. మరి పై నామినేషన్‌ లిస్టులో ఏమైనా మార్పుచేర్పులు ఉంటాయా? లేదా? అనేది తెలియాలంటే బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌ల జాబితా ఇదిగో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement