బిగ్‌బాస్‌ 8: వేణుస్వామి, బర్రెలక్క.. ఇంకా ఎవరున్నారంటే? | Bigg Boss Telugu 8: These Contestants May Participate Show | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ 8: వేణుస్వామి ఎంట్రీ? అధిక పారితోషికం ఈయనకేనా?

Jul 5 2024 4:48 PM | Updated on Jul 5 2024 6:01 PM

Bigg Boss Telugu 8: These Contestants May Participate Show

బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. ఇచట అన్నిరకాల సెలబ్రిటీలు ఉంటారు. వెండితెర, బుల్లితెర, సోషల్‌ మీడియా.. కాదేదీ బిగ్‌బాస్‌కు అనర్హం అన్నట్లుగా భిన్న రంగాలకు చెందినవారినీ తీసుకొస్తారు. అలా ఇప్పటివరకు నటీనటులు, కొరియోగ్రాఫర్లు, దర్శకులు, సింగర్లు.. ఇలా అందరినీ పట్టుకొచ్చారు. అయితే ఈసారి ఓ జ్యోతిష్యుడిని హౌస్‌లోకి తీసుకొస్తున్నారట!

బిగ్‌బాస్‌ షోలో వేణుస్వామి?
అతడే వేణుస్వామి.. టీవీలో, యూట్యూబ్‌ ఛానల్‌లో జ్యోతిష్యం చెప్తూ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్‌ అయ్యాడు. సినీ సెలబ్రిటీల కెరీర్‌ గురించి కూడా ముందుగానే అంచనా వేస్తుంటాడు. కొందరు తారలు కెరీర్‌లో ముందుకు వెళ్లాలని ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. ఇందుకోసం లక్షల్లోనే తీసుకుంటాడు. ఇలా పూజలు, హోమాలు అంటూ వేణుస్వామి లక్షల్లోనే సంపాదిస్తాడు. అలాంటిది తనను హౌస్‌లోకి తీసుకురావాలంటే భారీ మొత్తం ఆఫర్‌ చేయాల్సిందే! అయినా సరే బిగ్‌బాస్‌ టీమ్‌ వేణుస్వామిని హౌస్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందట! 

వేణుస్వామితో పాటు వీళ్లు కూడా..
మరి ఈ ఆఫర్‌ను ఒప్పుకుని ఆయన వస్తాడా? వస్తే వీకెండ్‌లో నాగార్జున ఏం చెప్తాడో ముందే ఊహిస్తాడా? అక్కడ కూడా జాతకాలు చెప్తాడా? అనేది చూడాలి. అలాగే తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లోకి బర్రెలక్క, కిర్రాక్‌ ఆర్పీ, కుమారి ఆంటీ, కుషిత కళ్లపు, సోనియా సింగ్‌ వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజముందన్నది రానున్న రోజుల్లో తెలియనుంది.

చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement