Bollywood Director Sai Kabir In Rehab Centre - Sakshi
Sakshi News home page

Sai Kabir Drugs Abuse:‍ మొన్ననే సినిమా రిలీజ్.. డైరెక్టర్ ఏమో ఇలా!

Jun 27 2023 2:09 PM | Updated on Jun 27 2023 3:33 PM

Bollywood Director Sai Kabir In Rehab Centre - Sakshi

టాలీవుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. నిర్మాత కేపీ చౌదరితో పలువురు నటీనటులకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నటి సురేఖావాణి, అషూరెడ్డి స్వయంగా వీడియోలు రిలీజ్ చేసి మరీ తమకు ఈ కేసుతో ఎలాంటి లింక్ లేదని చెప్పుకొచ్చారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ వివాదం నడుస్తుండగా.. బాలీవుడ్ లో ఓ డైరెక్టర్ రిహాబిటేషన్ సెంటర్‌లో ఉన్నట్లు ఓ న్యూస్ బయటకొచ్చింది. ఇప్పుడీ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

(ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!)

కంగనా రనౌత్ నిర్మించిన 'టీకూ వెడ్స్ షేరు' సినిమా 3-4 రోజుల ముందే ఓటీటీలో నేరుగా విడుదలైంది. దీనికి సాయి కబీర్ దర్శకత‍్వం వహించాడు. అంతకు కొన్నిరోజుల ముందు జరిగిన ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఇతడు కనిపించలేదు. మూవీని ప్రమోట్ చేస్తూ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఏమైందని ఆరా తీయగా.. గతంలో డ్రగ్స్ వాడకం వల్ల ఇతడి దానికి బాగా అడిక్ట్ అయిపోయాడని, దాన్నుంచి బయటపడేందుకు ప్రస్తుతం రిహాబిటేషన్ సెంటర్‌లో చేరినట్లు తెలుస్తోంది. 

15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సాయి కబీర్.. తొలుత రచయితగా పలు సినిమాలకు పనిచేశాడు. 2014లో కంగనా రనౌత్ ని ప్రధాన పాత్రలో పెట్టి తీసిన 'రివాల్వర్ రాణి' చిత్రంతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కంగన నిర్మించిన 'టీకూ వెడ్స్ షేరు' చిత్రానికి కూడా ఇతడే దర్శకత్వం వహించాడు. 2018లో ఇలానే రిహాబిటేషన్ సెంటర్ లో చేరిన కబీర్.. ఇప్పుడు మరోసారి ఆ చోటుకి వెళ్లడం చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన ఆషూ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement