ప్రముఖ సింగర్ బాంబే జయశ్రీ అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం యూకేలో ఉన్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తీవ్రమైన మెడనొప్పితో ఆమె కిందపడిపోయారని సన్నిహితులు వెల్లడించారు. ఆమె లివర్‌పూల్‌లోని ఒక హోటల్‌లో అపస్మారక స్థితిలో కనిపించగా.. గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు.
(ఇది చదవండి: మా ఇంటి పని మనుషుల కాళ్లు మొక్కుతా..: రష్మిక)
కాగా ఆమెకు కీ హోల్ సర్జరీ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మందులకు కూడా ప్రతిస్పందిస్తోందని సన్నిహితులు తెలిపారు. ఆమె కోలుకున్న తర్వాత చెన్నైకి చేరుకునే అవకాశముంది. కాగా.. బాంబే జయశ్రీ పాటలతో ఫేమ్ తెచ్చుకుంది. ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది. బాంబే జయశ్రీకి సంగీత కళానిధి అవార్డును ప్రదానం చేయనున్నట్లు సంగీత అకాడమీ ఇటీవలే ప్రకటించింది. జయశ్రీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో అనేక సినిమా పాటలు పాడింది
Comments
Please login to add a commentAdd a comment