Boyapati Srinu And Ram Pothineni New Film Pooja Ceremony - Sakshi
Sakshi News home page

మరో మాస్‌ చిత్రం.. బోయపాటి, రామ్‌ మూవీ షురూ

Published Wed, Jun 1 2022 1:28 PM | Last Updated on Wed, Jun 1 2022 1:39 PM

Boyapati Srinu And Ram Pothineni New Film Pooja Ceremony - Sakshi

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన దివారియర్‌ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు(జూన్‌ 1)  పూజా కార్యక్రమాలతో ఈ  సినిమా ప్రారంభం అయ్యింది.

 హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్9గా  శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బోయపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. దర్శకుడిగా ఆయన ఇది 10వ సినిమా. హీరో రామ్ 20వ సినిమా ఇది.

ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ..బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. 'ది వారియర్' తర్వాత మా హీరో రామ్‌తో వెంటనే మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా చేయబోతున్నాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తాం’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement