Can Not Imagine Life Without You Says Samantha: సమంత ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, వీలు కుదిరినప్పుడల్లా వెకేషన్స్‌ను చుట్టేస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సామ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్‌చేస్తూ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
రీసెంట్‌గా కేరళలోని అతిరప్పిల్లీ వాటర్ ఫాల్స్ వెళ్లి అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఫొటోలకు పోజులిచ్చిన సామ్ ఆ జలపాతాలను జీవితంతో పోల్చుతూ మోటివేషనల్ కోట్స్‌తో ఆలోచింపజేసింది.తాజాగా తన బెస్ట్‌ఫ్రెండ్‌తో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను (cant imagine life without you) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బెస్ట్‌ఫ్రెండ్ అంటూ ఆమెతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' షూటింగ్ కంప్లీట్ చేసిన సామ్ ప్రస్తుతం 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే సినిమాలోనూ నటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment