
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును ఛేదించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై శుక్రవారం సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ముంబైలోని డీఆర్‌డీఓ గెస్ట్ హౌజ్‌లో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. దాదాపు గంటన్నరగా ప్రశ్నించిన అధికారులు రియా నుంచి సరైన సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి : సీబీఐ కార్యాలయానికి రియా చక్రవర్తి
‘సుశాంత్‌లో పరిచయం ఎలా ఏర్పడింది. ఆ పరిచయం ఎంత వరకు వెళ్లింది. చివరి సారిగా అతనితో మాట్లాడింది ఎప్పుడూ.. అతని బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు ఎవరి ఖాతాలకు వెళ్లింది. సుశాంత్‌ను పెళ్లి చేసుకుందాం అనుకున్నారా.’. వంటి ప్రశ్నలను సీబీఐ అధికారులు రియాను సంధిస్తున్నట్లు సమాచారం. కాగా రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవకర్తిని కూడా అధికారులు విచారిస్తున్నారు. చదవండి : సుశాంత్ మెసేజ్ చేశాడు.. బ్లాక్ చేశా: రియా
వీరితోపాటు సుశాంత్ క్రియేటివ్ మేనేజర్ సిద్ధార్థ్ పితాని, వంట మనిషి నీరజ్ సింగ్, పని మనిషి కేశ్, ఇంటి మేనేజర్ శ్యాముల్లను కూడా సీబీఐ ప్రశ్నిస్తోంది. తన కొడుకును మానసికంగా వేధించారని, అతడి బ్యాంకు ఖాతాలోని డబ్బులను పెద్ద మొత్తంలో మళ్లించారన్న సుశాంత్ తండ్రి కేకే సింగ్ బిహార్ పోలీసులకు ఇచ్చిన కేసు ఆధారంగా మేరకు సీబీఐ విచారణ కొనసాగుతోంది. చదవండి : సుశాంత్ అన్నలాంటి వాడు.. సిగ్గుపడండి
Comments
Please login to add a commentAdd a comment