దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.సెకండ్ వేవ్ దాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజులకు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనే ఇదే పరిస్థితి. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ని ప్రకటించగా, మరికొన్ని కర్ప్యూ విధించాయి. అయినప్పటికీ కరోనా విజృంభణ కొనసాతూనే ఉంది. ఈ నేపథ్యంలో అందరు అప్రమత్తంగా ఉంటూ.. జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా విన్నవించింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. దేశంలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది. తప్పని సరిగా అందరూ మాస్కులు ధరించాలని కోరింది.
‘మీ కోసం, మీ ఫ్యామిలీ కోసం, స్నేహితుల కోసం, ఫ్రంట్‌లైన్ వారియర్ల కోసం మీరంతా ఇంట్లోనే ఉండండి. అత్యవసరం అయితేనే బయటకు రండి. బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించండి. ప్లీజ్.. పరిస్థితిని అర్థం చేసుకోండి. మీ వంతు వచ్చినప్పుడు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోండి.మనం తీసుకునే ఈ జాగ్రత్తలే వైద్యరంగంపై ఒత్తిడి తగ్గిస్తాయి’అని ప్రియాంక చోప్రా తెలిపింది. ప్రస్తుతం ప్రియాంక ‘సిటాడెల్’ అనే అమెజాన్ సిరీస్‌తో పాటు ‘మ్యాట్రిక్స్ 4’లోనూ నటిస్తోంది.
— PRIYANKA (@priyankachopra) April 20, 2021
చదవండి:
‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’
Comments
Please login to add a commentAdd a comment