
బాలీవుడ్లో కొన్నేళ్లుగా బయోపిక్ల హవా నడుస్తోంది.. తెలుగులో కూడా ఈ సంస్కృతి ఈమధ్య ఊపందుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ఈ తరహాలోనే ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈమధ్య అందరి మాటల్లో చర్చకు వస్తున్న ఓ విషయం ఆసక్తిని రేపుతోంది. అదే ప్రముఖ రాజకీయ నాయకుడు, అవినీతి మచ్చలేని వ్యక్తి, 5 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినప్పటికీ ఎలాంటి దోపిడీ దౌర్జన్యాలకి పాల్పడకుండా కేవలం ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసి సాదా సీదా జీవితం సాగిస్తున్న ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం గురించి ఒక బయోపిక్ వస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది.
గత ఆరు నెలలుగా ఈ కథకి సంబంధించిన అధ్యయనం జరుగుతుందని ఈ సినిమాని పరమేశ్వర్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ప్రజలతో పాటు ఈ తరం మరియు రాబోయే తరాల రాజకీయ నాయకులకు కూడా తెలిసే అవకాశం ఉందిదీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment