ప్రముఖ నటుడు శరత్ బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐరా అను, నక్షత్ర, అలేఖ్య, రవిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.
కొంతమంది యువతీయవకులు వినోదం కోసం సరదాగా ఓ స్కేరీ గేమ్ ఆడడం.. ఆ గేమ్ ఆడిన వారందరూ ఒక్కొక్కరుగా మృతి చెందడం లాంటి ఉత్కంఠభరిత సన్నివేశాలతో సాగే ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. అసలు ఆ గేమ్ ఆడిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? వాళ్లను హత్య చేసేదెవరు? ఆ గేమ్‌కు వరస హత్యలకు ఉన్న సంబంధం ఏంటి తదితర విషయాలు తెలియాలంటే ఆగస్ట్ 25న థియేటర్‌లో దక్ష సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment