aayush
-
Daksha: ఆ గేమ్ ఆడితే చాలు ప్రాణాలు పోతాయి.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ట్రైలర్
ప్రముఖ నటుడు శరత్ బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐరా అను, నక్షత్ర, అలేఖ్య, రవిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. కొంతమంది యువతీయవకులు వినోదం కోసం సరదాగా ఓ స్కేరీ గేమ్ ఆడడం.. ఆ గేమ్ ఆడిన వారందరూ ఒక్కొక్కరుగా మృతి చెందడం లాంటి ఉత్కంఠభరిత సన్నివేశాలతో సాగే ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. అసలు ఆ గేమ్ ఆడిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? వాళ్లను హత్య చేసేదెవరు? ఆ గేమ్‌కు వరస హత్యలకు ఉన్న సంబంధం ఏంటి తదితర విషయాలు తెలియాలంటే ఆగస్ట్ 25న థియేటర్లో దక్ష సినిమా చూడాల్సిందే. -
త్వరలో ఆయుష్ వీసా
గాంధీనగర్: ఆయుష్ (ఆయుర్వేద, యోగ, నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) చికిత్స కోసం భారత్ వచ్చేవాళ్లకు ప్రత్యేక వీసా కేటగిరీ ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి త్వరలో ప్రవేశపెట్టే ఆయుష్ మార్క్‌తో ఆ ఉత్పత్తులకు విశ్వసనీయత పెరుగుతుందన్నారు. 3 రోజుల అంతర్జాతీయ ఆయుష్ పెట్టుబడుల సదస్సును ప్రారంభించాక హీల్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మారిషస్ ప్రధాని జగన్నాథ్, డ బ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ ఔషధ విధానాల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక శాఖ ద్వారా నూతన సాంకేతికతలతో తయారయ్యే ఆయుష్ ఉత్పత్తులకు మార్కింగ్ ఇస్తారని మోదీ చెప్పారు. ‘‘సంప్రదాయ వైద్య విధానాల వల్లే కేరళలో టూరిజం పెరుగుతోంది. ఇది దేశమంతా విస్తరించాలి. హీల్ ఇన్ ఇండియా ఈ దశాబ్దానికి అతిపెద్ద బ్రాండ్ కావాలి’’ అన్నారు. దహోద్‌లో రూ. 20 వేల కోట్లతో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్లాంట్ పెడతామన్నారు. 1800 కోట్ల డాలర్ల విలువ 2014కు పూర్వం ఆయుష్ రంగ విలువ 300 కోట్ల డాలర్ల కన్నా తక్కువని, ప్రస్తుతమిది 1800 కోట్ల డాలర్లను దాటిందని మోదీ తెలిపారు. సంప్రదాయ వైద్య స్టార్టప్‌లకు ఆయుష్ శాఖ సాయం చేస్తుందన్నారు. ఈ రంగం నుంచి యూనికార్న్‌లు (వందకోట్ల డాలర్ల విలువ దాటిన స్టార్టప్‌లు) వస్తాయన్నారు. ఆయుష్ ఈమార్కెట్ పోర్టల్‌ను విస్తరించి రైతులను కంపెనీలతో అనుసంధానం చేస్తామని మోదీ తెలిపారు. విదేశీ మార్కెట్లలో ఆయుష్ ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఆయుష్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేశామని టెడ్రోస్ చెప్పారు. భారత్, మారిషస్ మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు పలు అంశాలపై మోదీ, జగన్నాథ్ చర్చలు జరిపారు. టెడ్రోస్ కాదు.. తులసీ భాయ్ హీల్ ఇన్ ఇండియా సదస్సుకు హాజరైన డ బ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌కు ప్రధా ని మోదీ తులసీ భాయ్ అని భారతీయ పేరు పెట్టారు. టెడ్రోస్ గుజరాతీలో ప్రసంగాన్ని ఆరంభించేందుకు ప్రయత్నించడాన్ని అభినందించారు. (చదవండి: పాల ఉత్పత్తిలో భారత్ టాప్) -
‘ఆ తర్వాతే ఆనందయ్య మందుల పంపిణీ’
విజయవాడ: ఆనందయ్య, నెల్లూరు జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన తర్వాతే మందుల పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఆనందయ్య మొత్తం ఐదు రకాల మందులు తయారు చేశాడని, ఇందులో P, L, F, ఐ డ్రాప్స్ శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్‌కి పంపామన్నారు. ఈ మందుల పనితీరు పరిశీలించే క్రమంలో సెంట్రల్ ఆయుష్ రీసెర్చ్ సెంటర్ సహాయం కూడా తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఐ డ్రాప్స్‌కి అనుమతి ఇవ్వలేదు ఆనందయ్య మందుల్లో P, L, F రకం మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనందువల్ల వినియోగానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఇక ఆనందయ్య మందుల్లో బాగా ఫేమస్ అయిన ఐ డ్రాప్స్ వల్ల ఎటువంటి హాని జరగదు అనేందుకు ఇంకా పూర్తి స్థాయి ఆధారాలు లభించలేదని ఆయన వెల్లడించారు. అందుకే ఐ డ్రాప్స్ వినియోగించడంపై నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు వివరించారు. కె రకం మందు శాంపిల్స్‌ని తాము పరిశీలించలేదని ఆయన చెప్పారు. ఇదే విషయాలని హైకోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చామని ఆయన వివరించారు. ఆయుర్వేదం కాదు ఆనందయ్య తయారు చేస్తున్న మందులు ఆయుర్వేద మందులు కాదని స్పష్టం చేశారు ఆయుష్ కమిషనర్. ఈ మందుల వల్ల కొవిడ్ తగ్గుతుందని ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న రోగులు, వైద్యులు సూచించిన ఔషధాలు వాడుతూ ఆనందయ్య మందును అదనంగా వాడటంలో ఇబ్బందులు లేవన్నారు. కానీ కేవలం ఆనందయ్య మందుపైనే పూర్తిగా ఆధారపడటం శ్రేయస్కరం కాదని ఆయన చెప్పారు. నేరుగా రావొద్దు ప్రస్తుతం ఆనందయ్య దగ్గరకు వస్తున్న రోగుల్లో ఎక్కువ మంది పీ,ఎల్,ఎఫ్ రకం మందులే అధికంగా వినియోగిస్తున్నారని రాములు వివరించారు. ఈ మందులు తీసుకునేందుకు రోగులు నేరుగా రావొద్దని సూచించారు ఆయుష్ కమిషనర్. రోగుల కుటుంబ సభ్యులు వచ్చి మందులు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ప్రొటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలంటూ ఆయన చెప్పారు. -
కేటీఆర్‌పై సీఈసీ కన్నెర్ర!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విభాగం ఆయుష్ వైద్యులతో మంత్రి కె.తారకరామారావు ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీవ్రంగా పరిగణించింది. 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కేటీఆర్‌ను బుధవారం ఆదేశించింది. గతనెల 7న హైదరాబాద్‌లోని బోల్‌క్లబ్‌లో ‘ఆయుష్ డాక్టర్స్ విత్ కేటీఆర్’పేరుతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఆయుష్ వైద్యులకు పలు హామీలిచ్చారు. ఈ ఘటనపై కొందరు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఈసీ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఇది అధికారిక సమావేశం కాదని, ప్రైవేటు సమావేశమని వారు నివేదికలో పేర్కొన్నారు. దీనిపై సీఈసీ స్పందిస్తూ.. ప్రభుత్వ వైద్యులతో ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించడాన్ని తప్పుపట్టింది. -
వేళ్లు విరిచి, చేతులు మడిచి వైద్యం
వికారాబాద్: పూర్వకాలం నాటి వైద్యం పేరుతో బీపీ,షుగర్, పక్షవాతం వంటి రోగాలను నయం చేస్తామంటూ ఓ ఘరానా ముఠా మోసానికి పాల్పడింది. ఆ ముఠాతో స్థానికంగా ఉండే కొం దరు వ్యక్తులు ఓ గ్రూపుగా ఏర్పడి ఈ శిబిరాన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. గురువారం పట్టణంలోని బసంత్ ఫంక్షన్ హాలులో ఈ సంఘటన వెలుగు చూసింది. కర్ణాటక రాష్టం లోని బళ్లారికి చెందిన నూర్ మహమ్మద్ అలీ అనే వ్యక్తి అక్కడ కొంత కాలంగా బీపీ, షుగర్, పక్షవాతం వంటి రోగులకు చేతి వేళ్లు విరవడం, అరచేతిలో గట్టిగా నొక్కడం, చేతిని మోచేతి వరకు వంచి రోగం నయమవుతుందని చెబుతూ.. ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేసి నట్లు తెలిసింది. ఈ రోగాలతో ఇబ్బంది పడుతున్నజిల్లా వాసులు కొందరు బల్లారి వరకు వెళ్లి ఇతడి వద్ద వెద్యం చేయించుకున్నారు. రోగుల ఆసక్తిని ఆసరాగా చేసుకున్న స్థానికులు కొం దరు ఓ గ్రూపుగా ఏర్పడి నూర్ మహ్మద్ అ లీని ఈ వైద్యం చేయించేందుకు వికారాబాద్‌కు తీసుకొచ్చేలా పథకం వేశారు. ఈ గ్రూపులోని ప్రతిసభ్యుడు వారికి కలిసిన అందరికీ ఈ వైద్యం గురించి చెప్పడంతో పాటు, ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకదని, తాము త్వరగా ఇప్పిస్తామని కూడా ప్రచారం చేశారు. గత పదిహేను రోజులుగా చాప కింద నీరులా ప్రచారం చేశారు. దీంతో ఏదో రకంగా రోగం నయమవుతుందనే ఆశతో మధ్యవర్తుల మాటలు నమ్మి వేల మంది ఈ శిబిరానికి వచ్చారు. ఇదే ముఠా నెల రోజుల క్రితం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడికి సుమారు 5,300 మంది రోగులు వచ్చి వేళ్లు విరిపించుకొని రూ.500 ఫీజుగా చెల్లించారు. ఆ రోజు రోగుల నుంచి సుమారు రూ.40లక్షలు వసూళ్లు చేసినట్లు సమాచారం. రోగుల నుంచి వసూళ్లు చేసిన దాంట్లో నూర్ మహ్మద్‌కు రూ.300, శిబిరం నిర్వహించిన వారికి రూ.200 తీసుకున్నట్లు సమాచారం. ఈ శిబిరంతో డబ్బులు పెద్ద మొత్తంలో రావడంతో పట్టణానికి చెందిన ఆ గ్రూప్ ఈ శిబిరాన్ని గురువారం మరోసారి నిర్వహించారు. పలు రోగాలతో బాధపడుతున్న అనేక మంది వేలల్లో ఇక్కడకు వచ్చారు. ఉదయం 6గంటలకే వరుసలో నిలబడి బళ్లారి డాక్టర్ వద్ద చేతులు విరిపించుకోవడం ప్రారంభించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వికారాబాద్ డీఎస్పీ శిరీష అక్కడికి వెళ్లి వైద్యం చేస్తున్న వ్యక్తి అర్హత గురించి అడుగగా ఆయూష్ వైద్యంలో నిష్ణాతుడినని ధ్రువీకరణ పత్రాలు చూపించే ప్రయత్నం చేశాడు. అవన్నీ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినవే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భారతదశ ప్రాచీన నాటు వైద్యం తాము చేస్తున్నట్లు వివరించే ప్రయత్నం చేశాడు. ఇంత పెద్ద మొత్తంలో జనాలను రప్పించినప్పుడు కనీసం పోలీసు అనుమతి తీసుకోవాలనే విషయం తెలియదా..? అని డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి సౌకర్యం లేదు, పైగా తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. దీంతో స్థానికంగా శిబిరం నిర్వహిస్తున్న నిర్వాహకులు సమాధానం ఇవ్వలేక అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సమయంలో శిబిరం నిర్వాహకులు, గ్రూప్ సభ్యులు కొందరు అక్కడికి వచ్చిన రోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వైద్యం చేస్తున్న వ్యక్తిని డీఎస్పీ ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం ఇవ్వలేక పోయాడు. గ్రూపులోని కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి తమకు షుగర్, బీపీ వంటివి తక్కువయ్యాయని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలాంటి వైద్యాలను నమ్మవద్దని పోలీసులు అక్కడి వచ్చిన జనాలను పంపించేశారు. గురువారం నిర్వహించిన ఈ శిబిరంలో కూడా భాదితుల నుంచి సుమారు రూ.40లక్షలు వసూళ్లు చేసినట్లు తెలిసింది. -
‘ఆయుష్’కు రూ. 1,626 కోట్లు
న్యూఢిల్లీ: ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.1626.37 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కన్నా 13 శాతం ఎక్కువ. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న వివిధ ప్రాజెక్టులు, పథకాలకయ్యే మొత్తం వ్యయాన్ని రూ.71.36 కోట్లుగా అంచనా వేశారు. గతేడాది బడ్జెట్లో ఇందుకోసం తొలుత రూ.68.86 కోట్లు కేటాయించి తరువాత రూ.87.64 కోట్లకు పెంచారు. నియంత్రణ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు ఈసారి కేటాయింపులు పెరిగాయి. చట్టబద్ధ, నియంత్రణ సంస్థలకు రూ.9.60 కోట్లు, స్వయంప్రతిపత్తి సంస్థలకు రూ.906.70 కోట్లు కేటాయించారు. చట్టబద్ధ, నియంత్రణ సంస్థల కింద న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, స్వయంప్రతిపత్తి సంస్థల్లో ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఉన్నాయి. -
ఆరోగ్యశ్రీ పరిధిలోకి ‘ఆయుష్’: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆయుష్ వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చాలని యోచిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు అలోపతి వైద్య సేవలు మాత్రమే ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్నాయి. ఆయుష్ (ఆయుర్వేదం, యునానీ, హోమియో, ప్రకృతి) వైద్య సేవలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ విభాగంలోని 56 రకాల సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయుష్ విభాగంలోని మొత్తం 56 రకాల వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చే ప్రతిపాదనపై లక్ష్మారెడ్డి సోమవారం సమీక్షించారు. ఏయే విభాగంలోని ఏయే సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలన్న దానిపై పరిశీలించి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవల బకాయిలు, చెల్లింపులపై ఆరా తీశారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్) అమలుపైనా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కల్తీలేని మోడల్ సిటీలు.. ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి లక్ష్మారెడ్డి ఆ విభాగం అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లోని ఒక్కో వీధిని ఎంపిక చేసి కల్తీలకు తావులేని వస్తువులను, పదార్థాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి అవసరమైన ప్రణాళికను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. స్వైన్ ఫ్లూ, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసుల నమోదు సంఖ్య ఎక్కువగా ఉన్నా.. తగిన వైద్యంతో మరణాల రేటు గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
ఆయుష్ ఎండీ దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని (సీజీఎన్) ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి కోర్సులకు సంబంధించి 2017–18 విద్యా సంవత్సరానికి ఎండీ, పీజీ కోర్సుల్లో ప్రభుత్వ వైద్యాధికారులు, పరిశోధన అధికారి పోస్టులకు దరఖాస్తు గడువును జూలై 31 వరకు పొడిగించినట్లు ప్రెస్ ఇన్ఫరేషన్ బ్యూరో శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఆయుష్‌ను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
కర్నూలు(హాస్పిటల్): ఆయుష్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేస్తోందని ఏపీ ఆయుష్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ జగనమోహన్‌మూర్తి, డాక్టర్ ఎస్. కేదార్నాథ్ విమర్శించారు. ఏపీ ఆయుష్ వైద్యుల సమావేశం ఆదివారం నగరంలోని డాక్టర్ అబ్దుల్ హక్ యునాని మెడికల్ కాలేజిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2008 నుంచి రాష్ట్రంలో ఆయుష్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయలేదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయుష్ వైద్య విధానం నిర్లక్ష్యానికి గురయ్యిందన్నారు. కొత్తగా ఏర్పాటైన అవశేష ఆంధ్రప్రదేశ్‌కు 587 వైద్యశాలలు కేటాయించగా, అందులో వైద్యాధికారుల నియామకం జరగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014లో నేషనల్ ఆయుష్ మిషన్‌లో ఆయుష్కు ప్రత్యేక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారన్నారు. కానీ మన రాష్ట్రంలో అందులో భాగంగా వైద్యాధికారుల నియామకం చేయలేదన్నారు. ఇందులో భాగమైన ఎన్‌ఆర్‌హెచ్‌ఎంలో ఆయుష్ వైద్యుల నియామకం సగభాగం మాత్రమేనని, వీరికి కూడా వేతనాలను 8 నెలలుగా చెల్లించడం లేదన్నారు. దాదాపు 1000కి పైగా వైద్యుల నియామకాలు జరపకుండా, కేంద్రం నుంచి వచ్చిన నిధులను పక్కదారి మళ్లించి వైద్యం ప్రజలకు అందకుండా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటోందన్నారు. మరోవైపు భవనాల కొరతతో ఆయుష్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు.ఎన్టీఆర్ వైద్యసేవ, ఉద్యోగశ్రీ, మెడికల్ రియంబర్స్మెంట్ విషయాల్లోనూ ఆయుష్ వైద్యులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేషనల్ ఆయుష్ మిషన్ బడ్జెట్‌ను ఆయుష్కు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్మూర్తి, సహాయ కార్యదర్శులు డాక్టర్ నాగేశ్వరరావు, డాకర్టర్ హయత్, డాక్టర్ ఖాద్రి, డాక్టర్ జలీల్, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్ భారితి, డాక్టర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
త్రిశంకుస్వర్గంలో ఆయుష్ ఉద్యోగులు
– ఏప్రిల్ నుంచి జీతాలు లేవు – ఉద్యోగాలు రెన్యువల్ చేయొద్దని ఆదేశాలు – అగమ్యగోచరంగా 41 మంది జీవితాలు కర్నూలు(హాస్పిటల్): ప్రాచీన భారతీయ వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. అక్కడ పనిచేసే ఉద్యోగులను పొమ్మనలేక పొగబెడుతోంది. ఆరునెలలుగా జీతాలు ఇవ్వక, రెన్యువల్ చేయక వేధిస్తోంది. ఫలితంగా తాము ఉద్యోగంలో ఉండాలో లేక వెళ్లిపోవాలో తేల్చుకోలేక ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జిల్లాలో రెగ్యులర్ ఆయుష్ డిస్పెన్సరీలతో పాటు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద నిర్వహించే డిస్పెన్సరీలు 44 ఉన్నాయి. 2008లో 22, 2009లో 22 డిస్సెన్సరీలను ప్రారంభించారు. ప్రతి డిస్పెన్సరీల్లో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక కాంపౌండర్, ఒక స్వీపర్ పోస్టులు మంజూరయ్యాయి. ఇక్కడ పనిచేసే మెడికల్ ఆఫీసర్లలో 19 మందిని 2012లో రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి, రెగ్యులర్ డిస్పెన్సరీల్లో పోస్టింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి వీరి వల్ల ఖాళీ అయిన ఎన్ఆర్హెచ్ఎం డిస్పెన్సరీలలో మెడికల్ ఆఫీసర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఫలితంగా ఇప్పటి వరకు అక్కడ కాంపౌండర్, స్వీపర్లే నెట్టుకొస్తున్నారు. రెన్యువల్ చేయరు.. జీతాలు ఇవ్వరు జిల్లాలోని ఆళ్లగడ్డ, గడివేముల, కోడుమూరు, కొలిమిగుండ్ల, మద్దూరు, యాళ్లూరు, దైవందిన్నె, గోకవరం, గోస్పాడు, హర్దగేరి, కలుదేవకుంట్ల, కొత్తబురుజు, డబ్లు్య. కొత్తపల్లి, పడిగిరాయి, పత్తికొండ, పలుకూరు, పెద్దకడుబూరు, చాగలమర్రి, కోవెలకుంట్ల, మిడుతూరు, పేరుసోముల, అవుకు డిస్పెన్సరీల్లో వైద్యులు లేరు. కాగా పలుకూరు, పెద్దకడుబూరు, అవుకులలో వైద్యులతో పాటు కాంపౌండర్, స్వీపర్ కూడా లేకుండా పోయారు. ఫలితంగా అవి ప్రస్తుతం మూతబడి ఉన్నాయి. వైద్యులు లేని డిస్పెన్సరీల్లో సిబ్బందికి గత ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వడం లేదు. వీరికి రెన్యువల్ కూడా చేయవద్దని ఆయుష్ కమిషనర్ నుంచి గత నెల 27వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జీతాలు ఇవ్వక, ఉద్యోగాలను రెన్యువల్ చేయకుండా తమను ప్రభుత్వం వేధిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం తమను పొమ్మనలేక పొగబెడుతున్నట్లుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.