
బెంగళూరు: కన్నడ సినిమా ‘లవ్ మాక్‌టైల్’ కపుల్ డార్లింగ్ కృష్ణ, నటి మిలన వివాహం వాలెంటైన్స్ డే రోజున జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఫిబ్రవరి 14న ఈ జంట ఏడడుగులు వేశారు. సంప్రాదాయబద్దంగా నిర్వహించిన ఈవేడుకలో పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం నృత్య వేడుకలు అలరించాయి. వీరిద్దరూ జంటగా నమ్మ దునియా నమ్మ స్టైల్, చాల్తి అనే సినిమాలలో నటించారు. పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను డార్లింగ్ కృష్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో నవ వధువరులిద్దరూ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్నారు. పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి. గత ఏడాది లవ్ మాక్టెయిల్ సినిమా విడుదల రోజున తమ ప్రేమ విషయాలను బయట పెట్టారు. ఈ సినిమా 2020 జనవరి 31న విడుదలవ్వగా కన్నడలో సూపర్‌హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment