దసరాతో తెలుగు వెండితెరపై బ్లాక్‌బస్టర్ డెబ్యూ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం (మే 31న) ఆయన వివాహం కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో ఘనంగా జరిగింది. ఈ దర్శకుడి పెళ్లికి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాడు. దసరా హీరో నాని కూడా ఈ పెళ్లికి రావాలని అనుకున్నప్పటికీ తన అప్‌కమింగ్ సినిమా షూటింగ్ పూణెలో జరుగుతుండటంతో శ్రీకాంత్ వివాహానికి హాజరు కాలేకపోయాడు. అటు కీర్తి సురేశ్ కూడా బిజీగా ఉండటంతో డైరెక్టర్ పెళ్లికి రానట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం ఎంతటి సెన్సేషనల్ విజయం అందుకుందో తెలిసిందే! నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ నాని కెరీర్‌లోనే అత్యధికంగా రూ.100 కోట్లు రాబట్టింది. దీంతో శ్రీకాంత్ నెక్స్ట్ సినిమా ఎవరితో తీస్తాడు? ఎలాంటి జానర్‌లో తెరకెక్కించనున్నాడు? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Join us in sending heartfelt congratulations to the newlyweds. @odela_srikanth has taken a leap into a lifetime of love and happiness❤️
— YouWe Media (@MediaYouwe) May 31, 2023
May your journey together be filled with endless moments of joy and togetherness 💑✨
-Team @MediaYouwe #SrikanthOdela #OdelaSrikanth #Dasara… pic.twitter.com/yqbqygjLPJ
చదవండి: గుంటూరు కారం ఎట్లా ఉంటాదో తెలుసా? అయితే ఈ టీజర్ చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment