Deepika Padukone Admitted To Breach Candy Hospital Last Night, Details Inside - Sakshi
Sakshi News home page

Deepika Padukone: ఆస్పత్రికి దీపికా పదుకొణె.. ఎందుకంటే?

Sep 27 2022 6:21 PM | Updated on Sep 27 2022 8:28 PM

Deepika Padukone Rushed to Breach Candy hospital last night - Sakshi

బాలీవుడ్ భామ దీపికా పదుకొణే ఆస్పత్రికెళ్లారు. సోమవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి కెళ్లిన హీరోయిన్ పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆమె వెంటనే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం దీపికా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లో ప్రభాస్‌ మూవీ  ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో పాల్గొంది. అదే సమయంలో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడంతో కామినేని ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు.

(చదవండి: ఆ బాధకు కారణం తెలియదు..ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: దీపికా పదుకోణె)

దీపికా పదుకొణె ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌ చిత్రం పఠాన్‌లో నటిస్తోంది. ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. మరోవైపు హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొణె ఫైటర్ చిత్రంలో నటించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీలోనూ దీపికా కనిపించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement