Jagame Thandhiram: తొలి రోజే ధనుష్‌కి భారీ షాక్‌! | Dhanush Jagame Thandhiram Movie Leaked In Piracy Websites | Sakshi
Sakshi News home page

Jagame Thandhiram:తొలి రోజే ధనుష్‌కి భారీ షాక్‌.. ఆన్‌లైన్‌లో ఫుల్‌ మూవీ లీక్‌

Published Fri, Jun 18 2021 1:46 PM | Last Updated on Fri, Jun 18 2021 4:13 PM

Dhanush Jagame Thandhiram Movie Leaked In Piracy Websites - Sakshi

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌కి ఎదురుదెబ్బ తగిలింది.  ఆయన హీరోగా నటించిన‘జగమే తందిరమ్’(తెలుగులో ‘జగమే తంత్రం’)​​ విడుదలైన తొలి రోజే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. టెలిగ్రామ్, తమిళ్ రాకర్స్ సహా కొన్ని పైరసీ మూవీలు అప్‌లోడ్ చేసే వెబ్‌సైట్స్‌లో దర్శనమిచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. రిలీజైన కొద్ది సేపట్లోనే పైరసీ సైట్లు ఈ మూవీ కంటెంట్‌పై దాడి చేయడం పట్ల.. చిత్ర యూనిట్‌ ఆందోళనకు గురవుతుంది. 

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నేడు(జూన్‌ 18)ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 

190 దేశాల్లో.. 17 భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మామూలుగా ఓటీటీలో సినిమా రిలీజ్‌ అంటే.. అర్థరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమ్‌ అవుతుంటాయి. అయితే జగమే తంత్రం మూవీ భారీ బడ్జెట్‌ మూవీ కావడం వల్ల ఇతర భాషల్లోనూ రిలీజ్‌ దృష్ట్యా ఈ మూవీ రిలీజ్‌ టైంని అర్థరాత్రి కాకుండా.. మధ్యాహ్నం 12.30గంటల నుంచి స్ట్రీమ్‌ అయ్యేలా.. సమయాన్ని మార్పు చేసింది.


చదవండి:
మన హీరోకి హాలీవుడ్‌ డైరెక్టర్ల విషెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement