Top Stories
ప్రధాన వార్తలు

భాషా యుద్ధానికి మేం సిద్ధం: తమిళనాడు సీఎం వార్నింగ్
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే త్రీ లాంగ్వేజ్ పాలసీకి తాము వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తమపై హిందీ బాషను బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం జరుగుతోందని స్టాలిన్ మండిపడ్డారు. అవసరమైతే మరో భాషా యుద్ధానికి తమిళనాడు సిద్ధంగా ఉందని హెచ్చరించారు స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం నూతన లాంగ్వేజ్ పాలసీపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ‘ మాపై హిందీని రుద్దాలనే యత్నం జరుగుతోంది. ఇది వద్దని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నాం. ఇందుకోసం మరో భాషా పోరాటానికైనా తమిళనాడు ప్రజలు సిద్ధం’ అని స్టాలిన్ పేర్కొన్నారు.మీది ద్వంద్వ వైఖరి.. కపట వైఖరి: అన్నామలైస్టాలిన్ వ్యాఖ్యలు చూస్తే ఆయనలో కపటత్వం కనబడుతోందన్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై. ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే లాంగ్వేజ్ పాలసీనే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్ ను నేర్చుకునే అవకాశాన్ని నిరాకరిస్తున్నారు కానీ మరి తమిళనాడులో ప్రైవేటు స్కూళ్లలో వారి సహచరులు నడిపే సీబీఎస్ఈ స్కూళ్లలో థర్డ్ లాంగ్వేజ్ లేదా అని ప్రశ్నించారు.మరి థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎటువంటి పరిమితులు లేవని స్టాలిన్ సూచిస్తున్నారా?, మీరు థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. మీ పిల్లల్ని మీ సహచరులు నడిపే స్కూళ్లలో చేర్చి నేర్చుకోండి. ఇక్కడ డీఎంకేది ద్వంద్వ విధానం. ధనికుల పిల్లలకు ఒక రకంగా, పేదల పిల్లలకు ఒక రకంగా వ్యవరిస్తోంది. ఇది కపట ధోరణి’ అంటూ అన్నామలై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

లోకేష్.. ఇవిగో ఆధారాలు..!
తాడేపల్లి : యూనివర్శిటీలలో వైస్ చాన్సలర్లు(వీసీ)లను బెదిరించి రాజీనామాలు చేయించిన సాక్ష్యాలను వైఎస్సార్ సీపీ బయటపెట్టింది. దీనికి సంబంధించిన ఆధారాలను వైఎస్సార్ సీపీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చారు. నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేష్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు.వీసీలు రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని శాసనమండలిలో వైఎస్సార్ సీపీ ప్రశ్నించగా, లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైస్ చాన్సలర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారంటూ లోకేష్ బుకాయించారు. వీసిలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారు. అయితే ‘ మీరే బెదిరించి.. మీరే విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయా?’ అని ప్రశ్నిస్తే లోకేష్ కు మౌనమే సమాధానమైంది.ఇవిగో ఆధారాలు.. న్యాయబద్ధంగా విచారణ చేయించండినారా లోకేష్ ఒత్తిడితో రాజీనామా చేసినట్లు ఆధారాలను బయటపెడుతున్నామని, ఏ మాత్రం నిజాయితీ ఉన్నా వీసీల రాజీనామాపై లోకేష్ న్యాయబద్ధంగా విచారణ చేయించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ అలా కాకపోతే ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేస్ రాజీనామా చేయాలని పేర్కొంది. అప్పుడే వాస్తవాలు బయటకి వస్తాయని, న్యాయం గెలుస్తుందని వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది.💣 Truth Bomb 💣ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి @naralokesh రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో నారా లోకేష్ ఆదేశాలతో ఛైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ… pic.twitter.com/9MKjYOtlHL— YSR Congress Party (@YSRCParty) February 25, 2025

పెళ్లి చేసుకుంటారా?.. ఉద్యోగం వదులుకుంటారా?: కంపెనీ వార్నింగ్
బ్యాచిలర్లకు మాత్రమే ఉద్యోగాలిచ్చే కంపెనీల గురించి విన్నాం. పెళ్లి చేసుకున్న వారికి జాబ్స్ ఇచ్చే కంపెనీలను చూసాం. కానీ పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుంది అని అంటోంది ఓ సంస్థ. దీని గురించి మరిన్ని వివరాలు విపులంగా ఇక్కడ తెలుసుకుందాం.చైనాలోని 'షాన్డాంగ్ షుంటియన్ కెమికల్ గ్రూప్ కో. లిమిటెడ్' కంపెనీ ఒంటరిగా ఉన్న, విడాకులు తీసుకున్న ఉద్యోగులు సెప్టెంబర్ నాటికి వివాహం చేసుకోవాలి. లేకుంటే.. ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని ఆదేశాలు జారీ చేసింది. అయితే వివాదాస్పద విధానాన్ని ప్రవేశపెట్టిన కంపెనీని అధికారులు మందలించారు.అధికారులు మందలించినప్పటికీ.. కంపెనీ మాత్రం తమ విధానాన్ని సమర్ధించుకుంది. దేశంలో వివాహ రేటు గణనీయంగా తగ్గుతోంది. వివాహ రేటును మెరుగుపరచాలనే ప్రభుత్వ పిలుపుకు మద్దతుగా ఈ ప్రకటన జారీ చేసినట్లు సంస్థ తెలిపింది. కానీ ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు కూడా విమర్శించారు.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం మీద.. పెకింగ్ యూనివర్సిటీ లా స్కూల్లో అసోసియేట్ ప్రొఫెసర్ 'యాన్ టియాన్' మాట్లాడుతూ.. చైనా కార్మిక చట్టాల ప్రకారం, కంపెనీలు ఉద్యోగ దరఖాస్తుదారులను వారి వివాహం లేదా పిల్లలు కనడానికి సంబంధించిన విషయాలను గురించి అడగడానికి అనుమతి లేదు. ఇది వారి స్వేచ్చకు భంగం కలిగించడం అవుతుందని అన్నారు. వివాదం ముదరడంతో.. కంపెనీ నోటీసును రద్దు చేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేసింది.

Champions Trophy 2025: భారత అభిమానిని స్టేడియంలో నుంచి ఈడ్చుకెళ్లిన పాక్ సిబ్బంది
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కొత్త వివాదం తలెత్తింది. భారత జెండాను కలిగి ఉన్నాడన్న కారణంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం నుండి ఓ వ్యక్తిని బయటకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పాకిస్తాన్ భద్రతా సిబ్బంది భారత జెండాను లాక్కొని, జెండాను పట్టుకున్న వ్యక్తిని స్టేడియంలో నుండి బయటికి ఊడ్చుకెళ్లారు. ఫిబ్రవరి 22వ తేదీన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Laughter Colours | Memes Only (@laughtercolours)ఈ వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్ అయిన సెకెన్లలో వైరలైంది. భారత జెండా కలిగి ఉన్న వ్యక్తి పాకిస్తాన్ పౌరుడే అయినప్పటికీ భారత అభిమాని అని తెలుస్తుంది. సదరు వ్యక్తిని పాక్ భద్రతా సిబ్బంది కొట్టి అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ వీడియోపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నుంచి ఎలాంటి స్పందన లేదు. భారత జెండా పట్టుకున్న వ్యక్తి పేరు, వివరాలు కూడా తెలియరాలేదు. ఈ వీడియో నిజమైతే మరెన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. భద్రతా సిబ్బంది నిజంగానే భారత అభిమానిపై దాడి చేసుంటే పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత అభిమానులు ఈ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు. క్రికెట్‌ను క్రికెట్ లాగే చూడాలి. క్రికెట్‌ను ఇతరత్రా విషయాలతో ముడి పెట్టకూడదని అంటున్నారు.ఇదిలా ఉంటే, 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు (ఛాంపియన్స్ ట్రోఫీ) ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్.. పట్టుమని 10 రోజులు కూడా టోర్నీలో నిలువలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైన ఆరు రోజుల్లోనే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్నటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ కథ ముగిసింది. ఈ టోర్నీలో పాక్ వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో పాక్‌తో పాటు బంగ్లాదేశ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఈ టోర్నీలో పాక్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్తులు ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదు. మరోవైపు ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్ ప్రయాణం జోరుగా సాగుతుంది. ఇరు జట్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను మట్టికరిపించాయి. ఈ రెండు జట్ల మధ్య నామమాత్రపు పోరు మార్చి 2న జరుగనుంది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 25) జరగాల్సిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటివరకు సౌతాఫ్రికా, ఆసీస్ తలో మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆసీస్‌తో పోలిస్తే సౌతాఫ్రికా మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. ఈ రెండు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడాయి. సౌతాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్‌ను.. ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను మట్టికరిపించాయి. టోర్నీలో రేపు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి.

‘పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు’
ఢిల్లీ: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈరోజు(మంగళవారం) విచారణలో భాగంగా పలువురు వైఎస్సార్ సీపీ నాయకులకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.అనంతరం వైఎస్సార్ సీపీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ తన కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటున్నారు. టీడీపీ గెలిచిన నాటి నుంచి ఫ్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులను వెంటాడి వేటాడి హింసిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన దాడి.. ఇప్పుడు కొత్త కేసులు పెట్టి 128 మందిని ముద్దాయిలను చేసి హింసిస్తున్నారు. టిడిపి కార్యాలయం, చంద్రబాబు నివాసం పై దాడి కేసుల్లో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. దేవినేని అవినాష్, జోగి రమేష్ లతో పాటు పలువురికి ముందస్తు బెయిల్ వచ్చింది. మన కార్యకర్తలు, నాయకులు కోసం పోరాడాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు. ఇందుకు ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు గర్వించాలి. ఎవరికి బెయిల్ రాకుండా, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చివరి వరకు ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణకు మా నాయకులు హాజరై సహకరిస్తారు’ అని పొన్నవోలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేతలకు ఊరట

మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్(Sajjan Kumar)కు జీవితఖైదు పడింది. అల్లర్లలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయాన్ని నిర్దారించిన ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం.. ఇదివరకే దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు శిక్ష ఖరారు చేస్తూ స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆదేశాలు జారీ చేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల(Anti Sikh Riots)లో భాగంగా నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హతమార్చింది. ఆపై ఆ ఇంట దోపిడీకి పాల్పడింది. ప్రత్యక్ష సాక్షి, జస్వంత్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని, ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని పేర్కొంటూ ఫిబ్రవరి 12వ తేదీ స్పెషల్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. సజ్జన్ కుమార్‌కు మరణశిక్ష విధించాలన్న జస్వంత్ భార్య పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఆయనకు జీవితఖైదు(Life Imprisonment) విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అయితే 2015లో అమిత్ షా(Amit Shah) చొరవతో అప్పట్లో ఈ కేసును సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఎవరీ సజ్జన్ కుమార్?ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్‌కు.. సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.సజ్జన్‌కు శిక్ష-ఎప్పుడు ఏం జరిగిందంటే.. 1991: అల్లర్లలో జస్వంత్, తరుణ్ దీప్ సింగ్‌ల హత్యపై కేసు నమోదు1994: జులై 8 సరైన ఆధారాలు లేవని చెబుతూ సజ్జన్ కుమార్ విచారణకు ఢిల్లీ కోర్టు నిరాకరణ2015 ఫిబ్రవరి 12: సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం2016 నవంబర్ 21: మరింత దర్యాప్తు అవసరమని కోర్టుకు తెలిపిన సిట్2021 ఏప్రిల్ 06: సజ్జన్ కుమార్ అరెస్ట్2021 మే 5 : సజ్జన్‌పై పోలీసుల ఛార్జ్‌షీట్ నమోదు2021, జులై 26: ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం2021, అక్టోబర్ 1: కోర్టులో వాదనలు ప్రారంభం2021, డిసెంబర్ 16: సజ్జన్ కుమార్‌పై అభియోగాలు నమోదు చేసిన కోర్టుజనవరి 31, 2024: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తుది వాదనలు విన్న కోర్టు2024, నవంబర్ 8: వాదనలు పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ప్రత్యేక కోర్టు2025, ఫిబ్రవరి 12: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు2025, ఫిబ్రవరి 25: సజ్జన్ కుమార్‌కు జీవితఖైదు ఖరారునానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో మొత్తం 2,733 మంది మరణించారు. మొత్తం 587 ఎఫ్ఐఆర్లలో కేవలం 28లో మాత్రమే 400 మందికి శిక్షలు పడ్డాయి. ఇప్పటికే యావజ్జీవంఇక ఢిల్లీ కంటోన్మెంట్(Delhi Cantonment)లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్దారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

మిర్చి రైతుల్ని నిట్టనిలువునా మోసం చేస్తూ.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
సాక్షి, అమరావతి : మిర్చి రైతులను చంద్రబాబు ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నా.. చేయలేమని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. వేరే రాష్ట్రాలనుంచి మిర్చి వస్తుంది కాబట్టి..మిర్చి విషయంలో మార్కెట్లో జోక్యం చేసుకోలేమని తేల్చేశారు. అదే సమయంలో ఇ-క్రాప్ ఆధారంగా రైతులవారీగా సబ్సిడీ ఆలోచన చేస్తామన్నారు. అదికూడా ఆలోచనలోనే ఉందన్నారు. అయితే, మరి అదే ఇ-క్రాప్ ఆధారంగా మార్కెట్లో జోక్యం ఎందుకు చేసుకోలేకపోతున్నారని, రైతుకు మంచి ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి నారా లోకేష్‌పై బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై చర్చలో వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు మంత్రులు ప్రయత్నించారు. ఆమె ప్రసంగాన్ని మంత్రి నారా లోకేష్ అడ్డుకున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదంటూ మంత్రి నారా లోకేష్ వాదించారు. గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారని వరుదు కళ్యాణి అన్నారు. తాము ఇంగ్లీష్ స్పీచ్‌లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం చేశారు.మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మంత్రి నారా లోకేష్ మళ్లీ అభ్యంతరం తెలిపారు.మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం.. మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదంటూ మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?. మా మీద ఆధారపడలేదని చెప్తారా..?. రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. అదే మా సభ్యురాలు చెప్తున్నది. 2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?’’ అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘‘చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు. తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి. సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?. ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?. అమ్మ ఒడి, రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.‘‘రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు. 60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు. 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం.. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీని కూడా పూర్తి చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు. టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశలేదు .. మీడియాతో బొత్సగవర్నర్ ప్రసంగంలో దశ లేదు.. దిశలేదు.. ఓ క్లారిటీ లేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలి మీడియా పాయింట్లో బొత్స మీడియాతో మాట్లాడారు. గవర్నర్ చాలా శ్రమించి ప్రసంగం కొనసాగించారు. ఆయన ప్రసంగంలో దశలేదు.. దిశలేదు. ఓ క్లారిటీ లేదు. సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసిన వ్యక్తితో అబద్దాలు, అసత్యాలు చెప్పించారు.19 మంది వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. వీసీలు తమ రాజీనామాల లేఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ నుండి ఫోన్స్ వచ్చాయని, అందుకే రాజీనామా చేశామని పేర్కొన్నారు. వీసీలు రాజీనామాలపై కమిటీ వేయాలని డిమాండ్ చేశాం.. వేస్తామన్నారు. తర్వాత మాట మార్చారు. 19 మంది వీసీల రాజీనామా లేఖల్ని బయట పెట్టాలి. ఒకేసారి అంతమంది వీసీలు ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి.. మారుతుంటాయి. అది వ్యవస్థ.. దాన్ని మార్చితే ఎలా?ప్రజా వ్యతిరేక, ప్రజలకు మేలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. సందర్భం, సమయం కానీ అంశాలు సభలో మాట్లాడం సమంజసం కాదు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్నారు. మంత్రి లోకేష్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. గ్రూప్ 2 మెయిన్స్‌పై లోకేష్ ట్వీట్ చేశారు.. మేం మా అభిప్రాయం చెప్పాం. వాకౌట్ చేయడానికి రెండు కారణాలు.ప్రసంగంలో దశ ,దిశ లేదు. గవర్నర్‌తో విధ్వంసం అనే మాట మాట్లాడించొచ్చా? మాట్లాడిన దాంట్లో కూడా అద్భుతాలు ఉన్నాయా అంటే అది లేదు.2047కి సూపర్ టెండర్ అంట..అంటే సూపర్ సిక్స్ పోయిందా?’ అని ప్రశ్నించారు.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీనే: సుబ్రహ్మణ్య స్వామి
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) అంటున్నారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు.‘‘తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా. నేను వేసిన పిల్ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది’’ అని మీడియాకు తెలిపారాయన. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారాయన. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీదేఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు. 👉మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఏపీ కూటమి ప్రభుత్వం (AP Kutami Prabhutvam)లో బీజేపీ భాగమై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీసే అవకాశం లేకపోలేదు.

నాపై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు.. సిగ్గనిపించడం లేదా: ప్రీతి జింటా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా (Preity Zinta) కాంగ్రెస్ (Congress) పార్టీపై భగ్గుమన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ఆమె పేర్కొన్నారు. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఆమె తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని బీజేపీ మాపీ చేసిందని కేరళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకు గాను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డునపడ్డారని ఆ పార్టీ పేర్కొంది. అయితే, ఇదే విషయంపై ప్రీతి జింటా ఫైర్ అయ్యారు.'నా సోషల్‌మీడియా అకౌంట్స్ అన్నీ సొంతంగానే నిర్వహించుకుంటాను. మరోకరికి అప్పగించలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటుగా ఉంది. 10ఏళ్ల కిందటే ఆ బ్యాంకు నుంచి తీసుకొన్న రుణాన్ని తీర్చేశాను. ఇన్నేళ్ల తర్వాత ఈ అంశపై కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్ట్ చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను తీసుకున్న రుణాన్నీ ఎవరూ మాఫీ చేయలేదు. ఆ అవసరం నాకు లేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆపేయండి. పూర్తి విషయం తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు. సాధారణంగా ఇలాంటి రూమర్స్‌కు నేను రియాక్ట్ అవను. కానీ, భవిష్యత్‌లో ఏమైనా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మాత్రమే వివరణ ఇస్తున్నాను.' అని ప్రీతి జింటా తెలిపారు.న్యూఇండియా కోఆపరేటివ్ ముంబై బ్రాంచ్‌లో ప్రితీ జింటా లోన్ తీసుకున్నట్లు తెలిపారు. అదే బ్యాంక్‌లో జనరల్ మేనేజర్, అకౌంట్స్ హెడ్‌గా పనిచేస్తున్న హితేష్ మెహతా రూ.122 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన్ను ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీతి జింటాపై కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేసింది.
నా సినిమాల్లో విలువలు ఉండేలా చూసుకుంటాను: దర్శకుడు నక్కిన త్రినాథరావు
మహిళ గొప్పతనం చాటేలా...
శివ శివ శంకరా...
ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది: హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్
ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకి హైకోర్టు నోటీసులు
మంత్రి లోకేష్‌కి వైఎస్సార్సీపీ స్ట్రాంగ్ కౌంటర్
ఇంగ్లండ్‌తో సమరం.. సత్తా చాటిన భారత బౌలర్లు
హైప్ అవసరం లేదు.. ఏది అవసరమో అది చేయండి చాలు: మమతా బెనర్జీ
WPL 2025: రాణించిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్
శామ్సంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్: వివరాలు లీక్..
భారత్‌ను ఓడించకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదు
Aus vs SA: కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. మ్యాచ్ రద్దు
మీకు 21 సీట్లు ఇచ్చినా హిమాలయాలకు వెళ్లిపోతారని సాక్షాత్తూ మోదీ గారే అంటున్నారు.. హోదా వాళ్లకిచ్చినా ప్రజల తరఫున మాట్లాడుతారు
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో
అయితే అన్నీ ఒక్కటేనన్నమాట!
NZ Vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’
ఈ రాశి వారికి ఆస్తి వివాదాల పరిష్కారం.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
EPFO కీలక ప్రకటన: ఆ గడువు మార్చి 15 వరకు పొడిగింపు
నా సినిమాల్లో విలువలు ఉండేలా చూసుకుంటాను: దర్శకుడు నక్కిన త్రినాథరావు
మహిళ గొప్పతనం చాటేలా...
శివ శివ శంకరా...
ఇండియాతో ఎంతో అనుబంధం ఉంది: హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్
ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకి హైకోర్టు నోటీసులు
మంత్రి లోకేష్‌కి వైఎస్సార్సీపీ స్ట్రాంగ్ కౌంటర్
ఇంగ్లండ్‌తో సమరం.. సత్తా చాటిన భారత బౌలర్లు
హైప్ అవసరం లేదు.. ఏది అవసరమో అది చేయండి చాలు: మమతా బెనర్జీ
WPL 2025: రాణించిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్
శామ్సంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్: వివరాలు లీక్..
భారత్‌ను ఓడించకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదు
Aus vs SA: కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. మ్యాచ్ రద్దు
మీకు 21 సీట్లు ఇచ్చినా హిమాలయాలకు వెళ్లిపోతారని సాక్షాత్తూ మోదీ గారే అంటున్నారు.. హోదా వాళ్లకిచ్చినా ప్రజల తరఫున మాట్లాడుతారు
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో
అయితే అన్నీ ఒక్కటేనన్నమాట!
NZ Vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’
ఈ రాశి వారికి ఆస్తి వివాదాల పరిష్కారం.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
EPFO కీలక ప్రకటన: ఆ గడువు మార్చి 15 వరకు పొడిగింపు
సినిమా

'గం గం.. గణేశా' సినిమా నిర్మాత మృతి
టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్‌లో మరణించారు. అయితే, ఆయన మరణానికి కారణాలు తెలియడం లేదు. తెలుగులో 'గం గం.. గణేశా' మూవీని కేదార్ నిర్మించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం గతేడాదిలో విడుదలైంది. అయితే, కేదార్ సెలగంశెట్టి మరణ వార్తను తెలుసుకున్న ఆయన మిత్రులు సంతాపం తెలుపుతున్నారు. కేదార్ సెలగంశెట్టికి ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. అల్లు అర్జున్, నిర్మాత బన్నీవాస్, విజయ్ దేవరకొండలకు ఆయన అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.కేదార్ సెలగంశెట్టిని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అల్లు అర్జున్ అని తెలిసిందే. ఇప్పటికే చాలామంది స్నేహితులను ఇండస్ట్రీకి అల్లు అర్జున్ పరిచయం చేశారు. ఈ క్రమంలో కేదార్‌ను కూడా బన్నీనే సపోర్ట్ చేశారు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించాలని కేదార్ సెలగంశెట్టి ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక మూవీని కూడా వారు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆయన హఠాత్తుగా మరణించారని వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ఆయన స్నేహితులు కూడా షాక్ అవుతున్నారు.

ఓటీటీలో 'మద్రాస్కారణ్' తెలుగు వర్షన్.. రొమాంటిక్ సాంగ్‌లో నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల తమిళ సినిమా తెలుగులో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న 'మద్రాస్కారణ్' చిత్రం కోలీవుడ్‌లో విడుదలైంది. ఈ మూవీలో షేన్ నిగమ్, కలైయరాసన్ హీరోలుగా నటించారు. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే తమిళ్ వర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వర్షన్‌ను మేకర్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి.జగదీష్ నిర్మించారు. తమిళ్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. విశాల్ మదగజరాజ మూవీ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు కాస్త క్రేజ్ తగ్గింది. శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న 'ఆహా'లో 'మద్రాస్కారణ్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, కోటి లోపే వసూళ్లను రాబట్టడంతో నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.ఏడేళ్ల తర్వాత రొమాంటిక్ పాత్రతో రీఎంట్రీసుమారు ఏడేళ్ల తర్వాత 'మద్రాస్కారణ్' సినిమాతో తమిళ్లో నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. 2018లో విజయ్ సేతుపతి నటించిన ఒక సినిమాతో ఆమె కోలీవుడ్‌కు పరిచయం అయింది. అయితే, ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు మద్రాస్కారణ్ మూవీలో మీరా అనే యువతిగా గ్లామర్ రోల్లో నిహారిక కనిపించింది. ఒక రొమాంటిక్ సాంగ్‌లో కూడా ఆమె నటించింది. ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇందులోని సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోయారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి! ఈ సినిమాతో హీరోయిన్గా హిట్టు కొట్టాలని నిహారిక ప్లాన్ చేసుకుంది. కానీ, ఫలితం మరోలా వచ్చింది.

జ్యోతిక గ్లామర్.. మంచులో బాపుబొమ్మ చిల్!
మంచులో చిల్ అవుతున్న హీరోయిన్ ప్రణీతగ్లామరస్ జ్యోతిక.. వయసు తగ్గించేస్తుందేమో!చీరలో చూడముచ్చటగా నటి ధన్య బాలకృష్ణస్టేడియం వీడియో షేర్ చేసి నేహా శర్మబీచ్ ఒడ్డున బికినీలో స్మైలీ పోజులతో హంస నందినిమెరుపు తీగలా నాజుగ్గా మెరిసిపోతున్న రాధికా ఆప్టేమోడ్రన్ డ్రస్సులో జిగేలుమనేలా షారుక్ కూతురు View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Suhana Khan (@suhanakhan2) View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Megha Chowdhury (@megha.chowdhury) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Akanksha Sharma (@akanksharmaa) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta)

ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో
థియేటర్లలో అంటే సెన్సార్ ఇబ్బందులు ఉంటాయి. కానీ ఓటీటీలో మాత్రం ఇబ్బందులు ఉండవు. దీంతో బోల్డ్, రియలస్టిక్ పేరిట బూతులు, రొమాన్స్ కాస్త గట్టిగానే చూపించేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ రొమాంటిక్ కామెడీ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. డేట్ ప్రకటించడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)ఆహా ఓటీటీలో 2022లో తమిళంలో రిలీజైన వెబ్ సిరీస్ 'ఎమోజీ'. మహత్ రాఘవేంద్ర, మానస చౌదరి, దేవిక ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో హిట్ అయిన ఈ సిరీస్ ని ఇప్పుడు తెలుగులో ఫిబ్రవరి 28 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.లవ్ చేసుకున్న ఓ యువతీయువకుడు అనుకోని విధంగా విడిపోతారు. ఆ కుర్రాడి జీవితంలోకి మరో అమ్మాయి వస్తుంది. కొన్నిరోజులకు మాజీ లవర్ మళ్లీ ఇతడి జీవితంలోకి వస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. టీజర్ చూస్తే మాత్రం బోల్డ్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్ కూడా కనిపించాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)Love, passion, and destiny. Will they find their way back? #Emoji Premiering February 28th, only on Aha#EmojionAha @Maanasa_chou @Devu_devika77 @Mahatofficial pic.twitter.com/XTqPqfAOPU— ahavideoin (@ahavideoIN) February 25, 2025
క్రీడలు

టీమిండియా వైస్ కెప్టెన్‌కు షాక్
టీమిండియా వైస్ కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధనకు (Smriti Mandhana) హండ్రెడ్ లీగ్ (The Hundred League) ఫ్రాంచైజీ సథరన్ బ్రేవ్ (Southern Brave) షాకిచ్చింది. గత కొంతకాలంగా తమకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంధనను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. గత సీజన్లో మంధన విఫలం కావడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. మంధన గత సీజన్లో 5 మ్యాచ్‌ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే సాధించింది. గత సీజన్లో విఫలమైనా మంధనకు హండ్రెడ్ లీగ్‌లో మంచి రికార్డు ఉంది. 2022, 2023 సీజన్లలో ఆమె మంచి స్ట్రయిక్ రేట్‌తో వరుసగా 211, 238 పరుగులు చేసింది.ఆసక్తికరంగా మంధన ఆర్సీబీ టీమ్ మేట్ అయిన డానీ వ్యాట్‌ను (ఇంగ్లండ్ ఓపెనర్) సథరన్ బ్రేవ్ తొలి రీటెన్షన్గా దక్కించుకుంది. వ్యాట్‌తో పాటు లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మయా బౌచియర్, ఫ్రేయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కార్టీన్ కోల్మన్, రిహన్నా సౌత్బైలను కూడా రీటైన్ చేసుకుంది. రిటెన్షన్ జాబితాను సథరన్ బ్రేవ్ ఇవాళ ప్రకటించింది.మంధన ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో బిజీగా ఉంది. ఈ సీజన్లో ఆమె 4 మ్యాచ్‌ల్లో 122 పరుగులు చేసింది. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. మంధన ఈ సీజన్లో తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. ఫలితంగా భారం మొత్తం ఎల్లిస్ పెర్రీపై పడుతుంది. పెర్రీ ఈ సీజన్లో విశేషంగా రాణిస్తుంది. నిన్న యూపీతో జరిగిన మ్యాచ్‌లో పెర్రీ అజేయమైన 90 పరుగులు చేసినా ఆర్సీబీ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్లో యూపీ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ ఓటమిపాలైంది.డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్, ఢిల్లీపై విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉన్నట్లు కనిపించింది. అయితే ఆతర్వాతి మ్యాచ్‌ల్లో వరుసగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ చేతుల్లో ఓడింది. అయినా ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ముంబై, యూపీ, ఢిల్లీ, గుజరాత్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 25) జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ, గుజరాత్ తలపడనున్నాయి.

Champions Trophy 2025: భారత అభిమానిని స్టేడియంలో నుంచి ఈడ్చుకెళ్లిన పాక్ సిబ్బంది
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కొత్త వివాదం తలెత్తింది. భారత జెండాను కలిగి ఉన్నాడన్న కారణంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం నుండి ఓ వ్యక్తిని బయటకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పాకిస్తాన్ భద్రతా సిబ్బంది భారత జెండాను లాక్కొని, జెండాను పట్టుకున్న వ్యక్తిని స్టేడియంలో నుండి బయటికి ఊడ్చుకెళ్లారు. ఫిబ్రవరి 22వ తేదీన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Laughter Colours | Memes Only (@laughtercolours)ఈ వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్ అయిన సెకెన్లలో వైరలైంది. భారత జెండా కలిగి ఉన్న వ్యక్తి పాకిస్తాన్ పౌరుడే అయినప్పటికీ భారత అభిమాని అని తెలుస్తుంది. సదరు వ్యక్తిని పాక్ భద్రతా సిబ్బంది కొట్టి అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ వీడియోపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నుంచి ఎలాంటి స్పందన లేదు. భారత జెండా పట్టుకున్న వ్యక్తి పేరు, వివరాలు కూడా తెలియరాలేదు. ఈ వీడియో నిజమైతే మరెన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. భద్రతా సిబ్బంది నిజంగానే భారత అభిమానిపై దాడి చేసుంటే పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత అభిమానులు ఈ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు. క్రికెట్‌ను క్రికెట్ లాగే చూడాలి. క్రికెట్‌ను ఇతరత్రా విషయాలతో ముడి పెట్టకూడదని అంటున్నారు.ఇదిలా ఉంటే, 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు (ఛాంపియన్స్ ట్రోఫీ) ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్.. పట్టుమని 10 రోజులు కూడా టోర్నీలో నిలువలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైన ఆరు రోజుల్లోనే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్నటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ కథ ముగిసింది. ఈ టోర్నీలో పాక్ వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో పాక్‌తో పాటు బంగ్లాదేశ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఈ టోర్నీలో పాక్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్తులు ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదు. మరోవైపు ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్ ప్రయాణం జోరుగా సాగుతుంది. ఇరు జట్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను మట్టికరిపించాయి. ఈ రెండు జట్ల మధ్య నామమాత్రపు పోరు మార్చి 2న జరుగనుంది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 25) జరగాల్సిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటివరకు సౌతాఫ్రికా, ఆసీస్ తలో మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆసీస్‌తో పోలిస్తే సౌతాఫ్రికా మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. ఈ రెండు జట్లు తమతమ తొలి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడాయి. సౌతాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్‌ను.. ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను మట్టికరిపించాయి. టోర్నీలో రేపు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి.

CT 2025 Aus vs SA: టాస్ పడకుండానే కీలక మ్యాచ్ రద్దు.. ఆసీస్‌కు..
ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా(Australia vs South Africa) మధ్య వన్డే మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే ఆట ముగిసిపోయింది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా గ్రూప్-‘బి’లో ఉన్న ఆసీస్- ప్రొటిస్ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.రావల్పిండి(Rawalpindi) వేదికగా జరగాల్సిన ఈ కీలక మ్యాచ్‌కు ఆది నుంచే వరణుడు అడ్డు తగిలాడు. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కాస్త తెరిపినిచ్చినా మ్యాచ్ మొదలుపెట్టేందుకు సిద్ధం కాగా వర్షం మాత్రం ఆగలేదు. కాసేపు వాన ఆగినా.. కొద్దిసేపటి తర్వాత మళ్లీ చినుకులు పడ్డాయి.కటాఫ్ టైమ్ రాత్రి 7.32 నిమిషాల వరకుఇలా ఆగుతూ, సాగుతూ దోబూచులాడిన వరణుడి కారణంగా ఆఖరికి అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం తగ్గకపోవడంతో.. మ్యాచ్ మొదలయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కటాఫ్ టైమ్ రాత్రి 7.32 నిమిషాల వరకు ఉన్నప్పటికీ కనీసం ఇరవై ఓవర్ల మ్యాచ్ సాగేందుకు కూడా గ్రౌండ్ పరిస్థితి అనుకూలంగా లేదు. చెరో పాయింట్దీంతో మొదలుకాకుండానే మ్యాచ్ ముగిసిపోయినట్లు ప్రకటించిన అంపైర్లు.. నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం ఆధారంగా ఈ గ్రూప్ నుంచి టోర్నీ నుంచి వైదొలిగే తొలి జట్టు ఖరారు కానుంది.ఇక తాజాగా వచ్చిన ఒక్కో పాయింట్‌తో బవుమా సారథ్యంలోని సౌతాఫ్రికా, స్మిత్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా చెరో మూడు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే, నెట్ రన్‌రేటు పరంగా పటిష్ట స్థితిలో ఉన్న ప్రొటిస్ జట్టు పట్టికలో టాప్‌లో కొనసాగుతుండగా.. ఆసీస్ రెండో స్థానంలో ఉంది. ఇక సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో, ఆస్ట్రేలియా అఫ్గనిస్తాన్‌తో తలపడతాయి. ఇందులో విజయం సాధిస్తే గనుక ప్రొటిస్, కంగారు జట్లు నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడతాయి.ఇక చాంపియన్స్ ట్రోఫీలో మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. అయితే, గ్రూప్-‘ఎ’లో భాగంగా తమ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తమ మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఆసీస్‌కు ఇది నాలుగోసారికాగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో గత ఎనిమిది మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాకు నాలుగుసార్లు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడం లేదంటే.. ఫలితం తేలకుండానే గేమ్ ముగిసిపోయింది.చాంపియన్స్ ట్రోఫీ-2025 పాయింట్ల పట్టికగ్రూప్-‘ఎ’👉న్యూజిలాండ్- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్ రన్‌రేటు+0.863(సెమీస్‌కు అర్హత)👉ఇండియా- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్ రన్‌రేటు +0.647(సెమీస్‌కు అర్హత)👉బంగ్లాదేశ్- ఆడినవి రెండు- ఓడినవి రెండు- పాయింట్లు సున్నా- నెట్ రన్‌రేటు-0.443(ఎలిమినేటెడ్)👉పాకిస్తాన్- ఆడినవి రెండు- ఓడినవి రెండు- పాయింట్లు సున్నా- నెట్ రన్‌రేటు-1.087 (ఎలిమినేటెడ్)గ్రూప్-బి👉సౌతాఫ్రికా- పూర్తైనవి రెండు- ఒక గెలుపు- ఒకటి రద్దు- పాయింట్లు మూడు- నెట్ రన్‌రేటు +2.140👉ఆస్ట్రేలియా- పూర్తైనవి రెండు- ఒక గెలుపు- ఒకటి రద్దు- పాయింట్లు మూడు- నెట్ రన్‌రేటు +0.475👉ఇంగ్లండ్- ఆడింది ఒకటి- ఓడింది ఒకటి- పాయింట్లు సున్నా- నెట్ రన్‌రేటు -0.475👉అఫ్గనిస్తాన్- ఆడింది ఒకటి- ఓడింది ఒకటి- పాయింట్లు సున్నా- నెట్ రన్‌రేటు-2.140.చదవండి: పదే పదే అవే తప్పులు.. పాక్‌పై గెలిచి విజయంతో ముగిస్తాం: బంగ్లాదేశ్ కెప్టెన్

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఫోర్ టైమ్ వరల్డ్‌కప్ విన్నర్
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కొత్త అసిస్టెంట్ కోచ్‌ను (Assistant Coach) నియమించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన 51 ఏళ్ల మథ్యూ మాట్ (Matthew Mott) డీసీ కొత్త అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటరైన మాట్.. వివిధ జాతీయ జట్ల హెడ్ కోచ్‌గా పలు వరల్డ్‌కప్‌లు గెలిచాడు. 2022 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లండ్ పురుషుల జట్టుకు మాట్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియా మహిళల జట్టు హెడ్ కోచ్‌గా మాట్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. మాట్ 2015-2022 మధ్యలో ఆసీస్ మహిళా టీమ్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఈ మధ్యకాలంలో ఆసీస్ ఓసారి వన్డే వరల్డ్‌కప్.. రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. దీని తర్వాత మాట్ ఇంగ్లండ్ పురుషుల జట్టు వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.మాట్ ఇంగ్లండ్‌ను 2022 టీ20 వరల్డ్‌కప్ గెలిపించినప్పటికీ.. అతని హయాంలో ఇంగ్లండ్ 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్‌ను నిలబెట్టుకోలేకపోయింది. ఫలితంగా మాట్ తన పదవీకాలం మధ్యలోనే ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన అనంతరం మాట్ సిడ్నీ సిక్సర్స్ అసిస్టెంట్ కోచ్‌గా మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.తదుపరి ఐపీఎల్ సీజన్లో మాట్ ఢిల్లీ క్యాపిటల్స్ నూతన హెడ్ కోచ్ హేమంగ్ బదానీతో కలిసి పని చేస్తాడు. డీసీ యాజమాన్యం బౌలింగ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్, భారత మాజీ పేసర్ అయిన మునాఫ్ పటేల్‌ను ఇటీవలే నియమించుకున్న విషయం తెలిసిందే. భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావు డీసీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తాడు.కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్రారంభం నుంచి వేర్వేరు పేర్లతో లీగ్‌లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. తొలి రెండు సీజన్లలో సెమీస్‌కు చేరిన ఈ జట్టు.. 2020 సీజన్లో అత్యుత్తమంగా ఫైనల్స్‌కు చేరింది. ఆ సీజన్ ఫైనల్లో డీసీ ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత మూడు సీజన్లలో ఢిల్లీ పేలవ ప్రదర్శన కనబర్చింది. మూడు సీజన్లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. తదుపరి సీజన్ కోసం ఢిల్లీ జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. పాత ఆటగాళ్లను దాదాపుగా వదిలించుకుని కొత్త ఆటగాళ్లను తీసుకుంది. మెగా వేలానికి ముందు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌ను రీటైన్ చేసుకుంది. కెప్టెన్ రిషబ్ పంత్ సహా ఆసీస్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లను వదిలేసింది. మెగా వేలంలో కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, టి నటరాజన్, డుప్లెసిస్ లాంటి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలంలో డీసీ యాజమాన్యం అత్యధికంగా 14 కోట్లు వెచ్చింది కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకుంది. తదుపరి సీజన్ కోసం డీసీ మేనేజ్మెంట్ తమ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు.2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, హ్యారీ బ్రూక్, అషుతోశ్ శర్మ, డుప్లెసిస్, సమీర్ రిజ్వి, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనోవన్ ఫెరియెరా, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, మాధవ్ తివారి, మన్వంత్ కుమార్, త్రిపురుణ విజయ్, అజయ్ మండల్, మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్
బిజినెస్

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 147.71 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో.. 74,602.12 వద్ద, నిఫ్టీ 5.80 పాయింట్లు లేదా 0.026 శాతం నష్టంతో.. 22,547.55 వద్ద నిలిచాయి.మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, నెస్ట్లే ఇండియా, మారుతి సుజుకి ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హిందాల్కో ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, ట్రెంట్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

తక్కువ ధర.. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్: ఇదిగో బెస్ట్ కార్లు
తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్స్, మంచి డిజైన్ కలిగిన కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు.. భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగానే దాదాపు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి సెలెరియోప్రారంభంలో సెలెరియో కారులో మారుతి సుజుకి కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లను మాత్రమే అందించింది. ఆ తరువాత కాలంలో ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించడం మొదలు పెట్టింది. అయితే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న కారు ధర.. స్టాండర్డ్ వేరియంట్ ధర కంటే కొంత ఎక్కువ. ఈ కారు ధరలు రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.37 లక్షల మధ్య ఉన్నాయి.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారులో కూడా కంపెనీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా ఉందులో ఉన్నాయి. ఈ కారు ధరలు రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.38 లక్షలు. ఇది 1.2 లీటర్ గ్యాసోలిన్ ఇంజిన్ ద్వారా 82 హార్స్ పవర్, 113.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.నిస్సాన్ మాగ్నైట్మార్కెట్లో ఎక్కువ అమ్ముడవుతున్న కార్ల జాబితాలో నిస్సాన్ మాగ్నైట్ ఒకటి. రూ. 6.12 లక్షల నుంచి రూ. 11.72 లక్షల మధ్య ధరలో అందుబాటులో ఉన్న ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు.. 360 డిగ్రీ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటివి కూడా ఉన్నాయి.హ్యుందాయ్ ఎక్స్టర్2023లో అత్యధిక అమ్మకాలు పొందిన హ్యుందాయ్ ఎక్స్టర్.. ఆరు ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ సీట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ మొదలైనవి పొందుతుంది. దీని ధరలు రూ. 6 లక్షల నుంచి రూ. 9.48 లక్షల మధ్య ఉన్నాయి.మారుతి సుజుకి స్విఫ్ట్ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ సీట్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన మారుతి స్విఫ్ట్ ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.50 లక్షల మధ్య ఉంది. ఇది పెట్రోల్, CNG రూపంలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?సిట్రోయెన్ సీ3ఫ్రెచ్ వాహన తయారీ సంస్థ అయిన.. సిట్రోయెన్ తన సీ3 కారులో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తోంది. రూ. 6.16 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు.. ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, డే - నైట్ ఐఆర్వీఎమ్ వంటి వాటిని పొందుతుంది. తక్కువ ధరలో.. మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్ల జాబితాలో సిట్రోయెన్ సీ3 ఒకటి.

యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసా..?
సంప్రదాయ ఉద్యోగ ఆధారిత పథకాలను మించిన యూనివర్సల్ పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం మెరుగైన ఫలితాలు ఇస్తుందని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా దీన్ని రూపొందిస్తున్నట్లు కొన్ని సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. అందులోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.అసంఘటిత రంగాల్లోని కార్మికులు, వ్యాపారులు, 18 ఏళ్లు పైబడిన స్వయం ఉపాధి పొందుతున్న అన్ని వర్గాల వారికి ఈ పథకం వర్తిస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ పథకం ఏ నిర్దిష్ట ఉపాధితో ముడిపడి ఉండదని చెబుతున్నారు. వ్యక్తులు తమ పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేలా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పెన్షన్ పథకంపై కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు ప్రారంభించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.రెండు పథకాలను కలుపుతారా..?ఈ పథకానికి సంబంధించిన పూర్తి ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసిన తర్వాత, ఇతర వివరాలను జోడించేందుకు, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక భాగస్వాముల నుంచి సూచనలు కోరుతుంది. ఇప్పటికే ఉన్న ప్రధాన మంత్రి-శ్రమ యోగి మాన్‌ధన్ స్కీమ్ (పీఎం-ఎస్వైఎం), నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ (ఎన్పీఎస్-ట్రేడర్స్) వంటి పెన్షన్ పథకాలను ఒకే వ్యవస్థ కింద క్రమబద్ధీకరించడం, వాటిని మరింత ప్రయోజనకరంగా, సులభంగా అందుబాటులో ఉంచడం ఈ పథకం లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ రెండు పథకాలు స్వచ్ఛందంగా 60 ఏళ్ల తరువాత నెలకు రూ.3000 పెన్షన్ అందిస్తుంది. అందుకు వయసును అనుసరించి రూ.55 నుంచి రూ.200 వరకు కంట్రిబ్యూట్ చేయాలి.అటల్ పెన్షన్ యోజన పథకం కూడా కొత్త పథకంలో చేరే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ (బీవోసీడబ్ల్యూ) చట్టం కింద వసూలు చేసిన మొత్తాన్ని ఈ రంగంలోని కార్మికులకు పింఛన్ల కోసం ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఐదేళ్లలో రిలయన్స్ రూ.50,000 కోట్ల పెట్టుబడులుఈ పథకం ఎందుకు అవసరం?భారతదేశంలో 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ జనాభా 2036 నాటికి 22.7 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఆదాయం లేని సమయంలో సమగ్ర సామాజిక భద్రత లేదా పెన్షన్ పథకం అవసరం ఉంటుంది. అమెరికా, యూరప్, కెనడా, రష్యా, చైనా వంటి అనేక దేశాల్లో పింఛన్లు, ఆరోగ్యం, నిరుద్యోగం వంటి వాటికి సామాజిక బీమా వ్యవస్థలు ఉన్నాయి. భారతదేశంలో సామాజిక భద్రత అధికంగా ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థ, వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్య భీమాపై ఆధారపడి ఉంది. ఇది ప్రధానంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుంది.

జీమెయిల్ లాగిన్ విధానంలో మార్పు!
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) వంటి వాటిలో ఫీచర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా గూగుల్ 'జీమెయిల్' కోసం ఓ అప్డేట్ తీసుకొచ్చింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ అప్డేట్ చేసింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి? దీనివల్ల ఉపయోగాలేంటి? అనే వివరాలు.. ఈ కథనంలో చూసేద్దాం.ఇప్పటి వరకు జీమెయిల్ లాగిన అయ్యే సమయంలో.. వినియోగదారు గుర్తింపును ధృవీకరించడానికి గూగుల్ ఆరు అంకెల అథెంటికేషన్ కోడ్లను ఎస్ఎమ్ఎస్ రూపంలో రిజిస్టర్ మొబైల్ నెంబరుకు పంపించేది. కానీ త్వరలో ఈ విధానానికి గూగుల్ స్వస్తి పలకనుంది. దీనికి బదులుగా క్యూఆర్ కోడ్‌ను తీసుకురానుంది. దీనిని వినియోగదారులు వివరాలను మరింత భద్రంగా ఉంచడానికి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.క్యూఆర్ కోడ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత.. మీకు ఆరు అంకెల అథెంటికేషన్ కోడ్ స్థానంలో క్యూఆర్ కోడ్ వస్తుంది. కాబట్టి మీరు మీ ఫోన్ కెమెరాతో ఆ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల ఎస్ఎమ్ఎస్ ఆధారిత మోసాలు తగ్గుతాయి. సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్న తరుణంలో గూగుల్ ఈ నిరన్యం తీసుకుంది.జీమెయిల్ లాగిన్ విధానంలో మార్పు క్యూఆర్ కోడ్ రూపంలో వస్తుందని మాత్రం చెబుతున్నారు. కానీ ఇది ఎప్పుడు అమలులోకి వస్తుందనే వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. బహుశా వీలైనంత త్వరగానే ఈ అప్డేట్ రావొచ్చని సమాచారం.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?
ఫ్యామిలీ

డ్రాగన్‌కు ఎండ దెబ్బా..?
డ్రాగన్ ఫ్రూట్ తోటలను ఎండ దెబ్బ(సన్ బర్న్) నుంచి కాపాడుకోవటం రైతులకు ఒక సవాలు వంటిదే. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటితే డ్రాగన్ ఫ్రూట్ చెట్లకు సన్ బర్న్ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సమస్య వస్తుంది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అనేక దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) సన్‌బర్న్ దెబ్బ నుంచి డ్రాగన్ పంటను కాపాడుకోవటానికి చేసిన సూచనలను తెలుసుకుందాం.. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్షియస్ దాటితే రాత్రి–పగటి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం కూడా పెరుగుతుంది. ఇది కూడా చెట్టును బలహీనపరుస్తుంది. ఆకు పచ్చగా నిగనిగలాడుతూ ఉండే డ్రాగన్ మొక్కల కాండాలు అధిక రేడియేషన్ వల్ల పత్రహరితాన్ని కోల్పోయి (బ్లీచ్డ్ అప్పియరెన్స్) తెల్లబోయి కాంతి హీనంగా కనిపిస్తాయి. అటువంటప్పుడు మొక్క పెరుగుదల మందగిస్తుంది. ఆ దశలో గనక రక్షక చర్యలు తీసుకోకపోతే డ్రాగన్ మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. మొక్క పశ్చిమ భాగంలోని డ్రాగన్ కాండాలకు సన్ బర్న్ నష్ట తీవ్రత 10% నుంచి 50% వరకు ఉంటుంది. కాండం కుళ్లు సోకుతుంది. ఇది విజృంభిస్తే ఏకంగా తోటలో మొక్కలన్నీటినీ రైతు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, సన్‌బర్న్ సమస్యను రైతులు సకాలంలో గుర్తించి, తగిన జాగ్రత్తలు పాటిస్తే డ్రాగన్ ఫ్రూట్ తోటలను ఎండల తీవ్రత నుంచి రక్షించుకోవచ్చు.పిచికారీఎండ తీవ్రత వల్ల పత్ర రంధ్రాల్లో నుంచి నీటి తేమ ఎక్కువగా వాతావరణంలోకి విడుదలవుతుంటుంది. అటువంటప్పుడు మొక్కలో నీటి శాతం తగ్గిపోతుంది. ఈ ప్రక్రియను తగ్గించగలిగే యాంటీ–ట్రాన్స్‌పైరెంట్స్‌ను పిచికారీ చేస్తే ఉపయోగం ఉంటుంది. డ్రాగన్ తోటను సన్ బర్న్ నుంచి రక్షించుకోవటానికి కోలినైట్ (లీటరు నీటికి 50 గ్రాములు) + నీమ్ సోప్ (లీటరు నీటికి 4 గ్రాములు) తో పాటు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ను, హ్యూమిక్ యాసిడ్ (లీటరు నీటికి 4 ఎం.ఎల్.) కలిపి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో పిచికారీ చేయాలని ఐఐహెచ్ఆర్ నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. సన్ బర్న్ నష్ట తీవ్రతతో పాటు శిలీంధ్ర, బాక్టీరియా తెగుళ్ల బెడదను కూడా తగ్గిస్తుందని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ తోటలో పోల్కి 8–10 లీటర్ల నీటిని డ్రిప్ ద్వారా ఇస్తే ఎండ తీవ్రతను తట్టుకోవటానికి అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎలుకలు కొరికేస్తున్నాయ్!డ్రాగన్ ఫ్రూట్.. ఖరీదైనది, పోషకాలతో కూడినదే కాకుండా, దీన్ని సేంద్రియంగా సాగు చేయటం కూడా సులభం. గ్రామీణప్రాంతాలతో పాటు నగరాల పరిసరప్రాంతాల్లోనూ డ్రాగన్ ఫ్రూట్ తోటలు విస్తరిస్తున్నాయి. ఇంటిపంటలు, మిద్దె తోటల్లోనూ డ్రాగన్ సాగు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ పంటకు ఎలుకల బెడద ఎదురవుతోందని కొల్లం (కేరళ) కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. కొల్లం జిల్లాలోని అనేకప్రాంతాల్లో డ్రాగన్‌కు ఎలుకల బెడద ఎదురవుతున్నట్లు సమాచారం రావటంతో కేవీకే భవనంపైనే ప్రయోగాత్మకంగా ఫైబర్ డ్రమ్ముల్లో డ్రాగన్ మొక్కల్ని పెంచారు. తెల్లవారుజామున 4–5 గంటల మధ్య ఎలుకలు డ్రాగన్ మొక్కల కాండం లోపలి గుజ్జును కొరికి తింటున్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. శరీరం కన్నా తోక ఎక్కువ ΄÷డవున్న రకానికి చెందిన ఎలుకలు ఈ పని చేస్తున్నాయని గుర్తించారు. ఎలుకలు కొరికిన కాండం ద్వారా నీరు, పోషకాల సరఫరా తగ్గిపోతుంది. దీంతో, పూత రాకపోవచ్చు. పూత వచ్చిన తర్వాత ఎలుకలు కొరికితే.. పూత, పిందెలు రాలిపోవచ్చు. అంతిమంగా, దిగుబడి తగ్గిపోతుంది.

పత్తి మానుకొని.. సిరిధాన్యాల సాగు!
ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి సాగులో, అందునా విత్తనోత్పత్తిలో నైపుణ్యం సాధించిన సీనియర్ రైతు కందిమళ్ల వేణుబాబు(52) ఆరేళ్ల క్రితం తన దృష్టిని సిరిధాన్యాల వైపు మళ్లించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వేణుబాబు మూడు దశాబ్దాల క్రితం కర్నూలు జిల్లాకు వలస వచ్చి స్థానికంగా దేవాలయ భూములను కౌలుకు తీసుకొని విత్తనోత్పత్తి లక్ష్యంగా పత్తి సాగు చేస్తుండేవారు. మరో 8 మంది రైతులతో కలసి ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘాన్నిప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన తల్లికి కేన్సర్ వ్యాధి సోకటంతో ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాల గురించి ఆలోచించారు. కర్నూలులో డాక్టర్ ఖాదర్‌వలి సభకు హాజరై సిరిధాన్యాల ఆహారంలో ఔషధ గుణాల గురించి తెలుసుకున్నారు. అప్పటికే పత్తి విత్తన రంగంలో ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా పత్తి సాగుకు స్వస్తి చెప్పి సిరిధాన్యాల సాగు వైపు పూర్తిగా దృష్టి మళ్లించారు.32 ఎకరాల్లో సిరిధాన్యాల సాగు 2019లో తొలిసారి ఏడు ఎకరాల్లో కొర్రలు, అండుకొర్రల సాగుకు శ్రీకారం చుట్టారు. క్రమంగా సాగు విస్తీర్ణాన్ని పెంచారు. కల్లూరు మండలం పందిపాడు గ్రామంలోఒకే చోట 25 ఎకరాల దేవాలయ భూములను కౌలుకు తీసుకొని వర్షాధారంగా ఖరీఫ్‌లో సిరిధాన్యాలతో పాటు అంతర పంటగా కంది సాగు చేస్తున్నారు. నీటి సదుపాయం గల మరో 7 ఎకరాల్లో ఖరీఫ్‌లో అండుకొర్ర పండిస్తున్నారు. రెండో పంటగా కంది, దోస సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేస్తారు. వేస్ట్ డీ కంపోజర్‌ను 4 సార్లు, పుల్ల మజ్జిగను రెండు సార్లు ట్రాక్టర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేయిస్తారు. 8 క్వింటాళ్ల కొర్రలతో పాటు ఎకరానికి 5 క్వింటాళ్ల కంది దిగుబడి పొందుతున్నారు. కందులతో పాటు ఎకరానికి అరికలైతే 7 క్వింటాళ్లు, సామలు 3 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తోందని వేణుబాబు తెలిపారు. మిషన్‌తో పంట కోయిస్తే ఎకరానికి రూ. 10 వేలు, కూలీలతో కోయిస్తే రూ. 15 వేల వరకు సాగు ఖర్చవుతుందని ఆయన తెలిపారు.సొంతప్రాసెసింగ్ సొంతప్రాసెసింగ్ యూనిట్యూనిట్సిరిధాన్యాలను పండించి టోకుగా అమ్మటం కన్నా బియ్యంగా మార్చి రిటైల్‌గా అమ్మటం ద్వారా అధికాదాయం వస్తుందని తొలిదశలోనే గుర్తించిన వేణుబాబు రూ. 15 లక్షలతో సొంతప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తాను పండించిన సిరిధాన్యాలతో పాటు ఇతర రైతులు పండించినవి కూడా కొని, మరపట్టించి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. పురుగుల బెడద లేకుండా వ్యాక్యూమ్ ΄్యాకింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. సుమారు 3 వేల మందికి నేరుగా సిరిధాన్యాల బియ్యం, రవ్వను అమ్ముతున్నారు. సాగు చేసి అమ్మటమే కాదు కుటుంబ సభ్యులంతా చిరుధాన్యాల ఆహారమే తీసుకుంటుండటం విశేషం. ఈ ఆహారంతో తాను బరువు తగ్గి చాలా ఆరోగ్యంగా ఉన్నానని వేణుబాబు సంతోషిస్తున్నారు. వినియోగ దారుల ఆదరాభి మానాలు పొందాలంటే రాళ్లు, ఇసుక రాకుండా సిరిధాన్యాల బియ్యం, రవ్వను అందించటం చాలా ముఖ్యమన్నారు.కలెక్టరేట్లో మిల్లెట్ కేఫ్చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సృజన కలెక్టరేట్ ఆవరణలో మిల్లెట్ కేఫ్ప్రారంభానికి వేణుబాబుకు అవకాశం ఇచ్చారు. సిరిధాన్యాల భోజనంతో పాటు జావ, లడ్డూలు, మురుకులు, బ్రెడ్ తదితర ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తమ వద్ద రోజువారీగా సిరిధాన్యాల ఆహారం తినే వారిలో 60% మంది యువతేనని ఆయన చెబుతున్నారు. క్వింటా రూ.4 వేలకు ప్రభుత్వం కొనాలిసిరిధాన్యాలకు గత ఏడాది మంచి ధర రావటంతో సాగు ఈ ఏడాది 50% పెరిగింది. గత సంవత్సరం కొర్ర ధాన్యం క్వింటా రూ. 5–6 వేలు పలికితే, ఈ ఏడాది 2,500కి పడిపోయింది. అండుకొర్రలు గత ఏడాది క్వింటా రూ. 8 వేలు పలికితే ఈ ఏడాది రూ.3,500కి పడిపోయింది. ఏ రకం సిరిధాన్యమైనా క్వింటా రూ. 4 వేలైతేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. సిరిధాన్యాల సాగు విస్తీర్ణం స్థిరంగా పెరగాలంటే ప్రభుత్వం రూ. 4 వేల చొప్పున కొనాలిæలేదా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. దీంతో పాటు.. మినీ హార్వెస్టర్లను రైతులకు సబ్సిడీపై అందించాలి. వీటితో రైతులే స్వయంగా పంట కోసుకోవచ్చు. మహిళలు కూడా వీటిని ఉపయోగించగలుగుతారు. సిరిధాన్యాల వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. మా దగ్గర ఇద్దరు ఆయుర్వేద వైద్యులు రోగులకు విధిగా సిరిధాన్యాల ఆహారాన్నే సూచిస్తున్నారు. వారి కోసం అర కేజీ ΄్యాకెట్ల కిట్లను అందిస్తున్నాం. సిరిధాన్యాల సాగుకు పెట్టుబడి తక్కువ.. నికరాదాయం ఎక్కువ. పూర్తి సంతృప్తి ఉంది. మా ఇంట్లోనూ సిరిధాన్యాలనే తింటూ ఆరోగ్యంగా ఉన్నాం. – కందిమళ్ల వేణుబాబు (94408 61443), చిరుధాన్యాల రైతు, కర్నూలు – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు

తొలి మహిళా పెట్రోల్ బంక్: 'స్త్రీశక్తి... ఇంధనమై'..
‘పెట్రోల్ బంక్‌లో మహిళలు ఉద్యోగం చేయగలరా!’ అనే పురుషాధిపత్య అనుమానాన్ని పటాపంచలు చేస్తూ... ‘బ్రహ్మాండంగా చేయగలరు’ అని నిరూపించారు మహిళలు.ఇప్పుడు ఆ దారిలో మరో ముందడుగు... తొలి మహిళా పెట్రోల్ బంక్. ఇద్దరు కలెక్టర్ల చొరవ, కృషితో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో తొలిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు అయింది...నారాయణపేట జిల్లాలో మహిళాసమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించాలనే ఆలోచన గత కలెక్టర్ కోయ శ్రీహర్షకు వచ్చింది. ‘మీరు ముందుకు వస్తే పెట్రోల్ బంకును ఏర్పాటు చేయిస్తాను’ అని హామీ ఇచ్చారాయన. దీంతో మహిళా సమాఖ్య సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. డీఆర్డీఏ కార్యాలయానికి అనుకొని ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ భూమిని డీఆర్డీఏ, జడ్ఎంఎస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి బీపీసీఎల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ బదిలీపై వెళ్లడంతో ‘అయ్యో!’ అనుకున్నారు. పెట్రోల్ బంక్ కల సాధ్యం కాదు అనుకున్నారు.అయితే ప్రస్తుత కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఫైల్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలోనే తొలి మహిళ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. 35 వేల లీటర్ల (పెట్రోల్, డిజిల్) నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెలా రూ.10 వేలు బీపీసీఎల్ మహిళా సమాఖ్యకు అందిస్తుంది. బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభించనుంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన ఒకాయన ఇలా అన్నాడు.... ‘ఎంతైనా ఆడవాళ్ల ఓపికే వేరు’ పెట్రోల్ బంక్‌ను విజయపథంలో నడిపించడంలో ఆ ఓపిక, ఉత్సాహం, శక్తిసామర్థ్యాలు వారికి ఇంధనంగా మారాయి.కలలో కూడా ఊహించలేదునారాయణపేటలో మహిళ సంఘం ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకుంటామని కలలో కూడా ఊహించలేదు. ఇది అయ్యే పని కాదనుకున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో బంకు ఏర్పాటు కావడం, అందులో సేల్స్ ఎగ్జిక్యూటిగా ఉద్యోగంలో చేరడం సంతోషంగా ఉంది. నెలకు రూ.11 వేల జీతం వస్తుంది. కుటుంబానికి ఎంతో అండగా ఉండేందుకు తోడ్పడుతుంది.– జగదీశ్వరి, సెల్స్ ఉమన్ , జడ్.ఎం.ఎస్. పెట్రోల్ బంకు మరింత మందికి ఉపాధినారాయణపేట జడ్ఎంఎస్ అధ్యక్షురాలిగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నా. జడ్ఎంఎస్కు వరి కొనుగోలు కేంద్రాల ద్వారా, స్త్రీనిధి కింద వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చేవాళ్లం. పెట్రోల్ బంక్ రూపంలో అదనపు ఆదాయం రావడంతో మరింత మంది ఉపాధి అవకాశాలకు వీలైంది.– చంద్రకళ, పెట్రోల్ బంకు మేనేజర్– కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్, సాక్షి, నారాయణపేట

మెడిటేషన్‌కి అనుగుణంగా ఇంటిని మార్చేద్దాం ఇలా..!
ఎన్నో కారణాల వల్ల ఇంటా బయటా ఒత్తిడితో జీవనం సాగించే రోజులివి. ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఎవరికి తోచిన సలహాలు వాళ్లు చెబుతుంటారు. కాని, ఇంట్లోనే సానుకూల వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ప్రశాంతతతో పాటు ధ్యాన సాధనకూ అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న మార్పులతో ధ్యానానికి అనువుగా ఇంట్లోనే ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి గదుల్లో ఏదైనా ఒక మూలన బుద్ధ ప్రతిమ లేదా క్యాండిల్స్, ఆర్టిఫియల్ ట్రీ లేలా ఇండోర్ ప్లాంట్ తీగలనూ డిజైన్ చేసుకోవచ్చు. ప్రశాంతతను కలిగించే సంగీతం వింటూ రోజూ ఈ ప్లేస్‌లో కాసేపు సేద దీరితే మనసు, శరీరం విశ్రాంతి పొందుతాయి.మట్టి కుండలు లేదా రాళ్లతో డిజైన్ చేసిన ఇండోర్ వాటర్ ఫౌంటైన్స్ లభిస్తాయి. వాటి అలంకరణతో జలపాతపు ఆహ్లాదాన్ని పొందవచ్చు. ధ్యానం చేయడానికి అనువైన ప్లేస్ అలంకరణకు బేబీ మాంక్స్ బొమ్మలు, బోన్సాయ్ మొక్కలు, స్టోన్ వర్క్‌తో డిజైన్ చేసిన వస్తువులను ఎంచుకోవచ్చు. వీటిని చూసినప్పుడు చికాకుగా ఉన్న మనసు కొంత కుదుటపడుతుంది. మనలోని ఏడు చక్రాలకు గుర్తుగా ఏడు రంగులు సూచికగా ఉంటాయి. వాటిని తలపించేలా కలర్ కాన్సెప్ట్‌తో చక్రా షెల్ఫ్ డిజైన్ చేసుకోవచ్చు. రెడీమేడ్‌గా లభించే వాటినీ అమర్చుకోవచ్చు. ఈ కలర్ చక్రా షెల్ఫ్‌ల రంగులను బట్టి ధ్యానాన్ని ఏకాగ్రతతో సాధన చేయవచ్చు. అలంకరణలో చక్రా షెల్ఫ్, వాల్ హ్యాంగింగ్, ఫొటో ఫ్రేమ్స్‌తో లివింగ్ రూమ్నీ అందంగా అలంకరించవచ్చు. (చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్‌లు..)
ఫొటోలు
National View all

హైప్ అవసరం లేదు.. ఏది అవసరమో అది చేయండి చాలు: మమతా బెనర్జీ
కోల్ కతా: మహా కుంభ మేళాను ‘మృత్య్ కుంభ్’గా ఆరోపించారంట

భాషా యుద్ధానికి మేం సిద్ధం: తమిళనాడు సీఎం వార్నింగ్
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే త్రీ లాంగ్వేజ్ ప

ఫోన్‌కు పుణ్యస్నానం..భర్తకు ప్రేమతో!
ప్రయాగ్ రాజ్: ఇప్పుడు ఏదైనా ఆన్ లైనే. ఆనాడు ఓ కవి.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు..

బీజేపీ నాయకుడితో శశిథరూర్ సెల్ఫీ.. పార్టీ మారతారా?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్.. బీజేపీకి దగ్గరవుతున్నట్టు కనబడుతోంది.

‘పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు’
ఢిల్లీ: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తలశిల ర
International View all

ఇంటర్నెట్ షట్‌డౌన్.. టెన్షన్
ఇంటర్నెట్ షట్డౌన్లో ఇండియా వరుసగా ఆరో ఏడాది టాప్‌లో నిలిచింది.

దూకుడు ఫలితం.. ట్రంప్ క్రేజ్‌కు బీటలు..?
వాషింగ్టన్: రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వరుస దూక

గవర్నర్ రేసు..వివేక్ రామస్వామికి ట్రంప్ మద్దతు
వాషింగ్టన్:భారత సంతతికి చెందిన బయోటెక్ బిలియనీర్ వివేక్ర

వీడియో: చూస్తుండగానే ఘోరం.. కుప్పకూలిన బ్రిడ్జి
దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోగా.. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

బంగ్లాదేశ్‌కు జైశంకర్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్‌కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర
NRI View all

Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం
డాలస్ : ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం
శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ

Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!
వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆ

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు ద
క్రైమ్

ఏడు అడుగులు.. ఏడేళ్ల వివాహేతర సంబంధం?
వరంగల్ క్రైం/ఖిలావరంగల్: వైద్యుడితో ఆమె ఏడడుగులు నడిచింది.. కానీ ఏడేళ్లనుంచి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆ వివాహేతర సంబంధమే వారి కుటుంబంలో చిచ్చురేపింది. చివరికి భర్తను చంపేయాలన్న నిర్ణయానికి వచ్చింది. వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 20వ తేదీ రాత్రి జరిగిన యువ వైద్యుడు గాదె సుమంత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును విచారిస్తున్న పో లీసులకు కేసు పూర్వాపరాలు ఓ సినిమా స్టోరీని తలపించినట్లు తెలిసింది. భార్య, ప్రియుడు సూత్రధారులుగా తేల్చి అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రేమ వివాహం..ఆపై వివాహేతర సంబంధం కాజీపేట మండలం ఫాతిమానగర్‌లోని ఓ చర్చిలో గాదె సుమంత్‌రెడ్డి, ఫ్లోరింజాలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటై ఏడడుగులు వేసి జీవితాన్ని ప్రారంభించిన ఆ జంట మధ్య వివాహేతర సంబంధం సమస్యలను తెచ్చిపెట్టింది. ఫోరింజ 2019లో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించింది. దానికంటే ముందు సంగారెడ్డిలో డాక్టర్ సుమంత్‌రెడ్డి ఆస్పత్రి నిర్వహించే క్రమంలో జిమ్‌కు వెళ్లిన ఆమెకు అందులో ఉద్యోగం చేసే సామేల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత ఆస్పత్రిని కాజీపేటకు మార్చారు. అయినా ఏడేళ్లుగా ఫోరింజ, సామేల్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇటీవల విషయం సుమంత్‌రెడ్డికి తెలియడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో సామేల్ .. ఫ్లోరింజలు కలిసి డాక్టర్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. దీనికి సంగారెడ్డిలో ప్లాన్ చేసి, భట్టుపల్లి దగ్గరలోని అమ్మవారిపేట వద్ద అమలు చేశారు. దాడి అనంతరం పారిపోయిన నిందితులను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. కాగా, వీరు అనేకసార్లు డాక్టర్‌పై దాడి ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు తెలిసింది. ఓసారి డాక్టర్‌ను నేరుగా బెదిరించి వదిలేసినట్లు తెలుస్తోంది. స్నేహితుడి కోసం వచ్చి..ప్రియురాలు ఫ్లోరింజ కోసం హత్య చేయడానికి సిద్ధమైన సామేల్ వెంట వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్ అయ్యాడు. సుమంత్‌పై దాడి అనంతరం ఏఆర్ కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌లో వదిలేసి సామేల్ బెంగళూరు పారిపోయాడు. కాల్ డేటా అధారంగా పోలీసులు నిందితులను త్వరగా పట్టుకోగలిగారు. ప్రాణాపాయ స్థితిలో వైద్యుడు సుమంత్ వైద్యుడు సుమంత్‌రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెడ, తలకు బలమైన గాయాలు కాగా, ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. కోడలిపై అనుమానం.. ఫిర్యాదు..డాక్టర్ సుమంత్‌రెడ్డిపై దాడి జరిగిన వెంటనే తల్లిదండ్రులు కోడలు ఫ్లోరింజాపై అనుమా నం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కాల్ డేటా వివరాలను పరిశీలించారు. అందులో కొన్ని నెలలుగా గంటల తరబడి మాట్లాడుతున్న ఫోన్ నంబర్, హత్యాయత్నం జరిగిన రోజు ఎక్కడ ఉంది అని చూశారు. హత్యాయత్నం జరిగిన సంఘటన స్థలానికి మ్యాచ్ అయినట్లు సమాచారం. దీంతో సూత్రధారి అయిన భార్యను అరెస్టు చేయకుండా ఫోన్‌నంబర్ అధారంగా పోలీసులు రెండు రోజులు బెంగళూర్‌లో గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకొని వరంగల్‌కు తీసుకువచ్చారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో అసలు నిందితురాలిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అరెస్టు చూపే అవకాశం ఉంది.

యువతిపై లైంగిక దాడి.. నిందితుడిపై కేసు నమోదు
సనత్‌నగర్(హైదరాబాద్): ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన యువతి (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొన్నేళ్ల క్రితం ఆమెకు బేగంపేట ప్రకాష్ నగర్‌కు చెందిన ఆర్యతో ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిరువురు తరచూ వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు యువతిని తన ఇంటికి తీసుకెళ్లిన ఆర్య ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో గర్భం దాల్చిన బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతేగాగా ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసిన అతను తనను విడిచిపెట్టి వెళ్లాలని, లేని పక్షంలో ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు సోమవారం బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై

రోహింగ్యాల వ్యవస్థీకృత వ్యభిచార దందా
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమంగా నగరానికి వలస వచ్చిన రోహింగ్యాలు వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. తమ జాతీయతను దాచి పెట్టడానికి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసుకున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం మెరుపు దాడులు చేశారు. 18 మందిని అదుపులోకి తీసుకుని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన ఈ రోహింగ్యాలు కోల్‌కతాలో నకిలీ ఆధార్ కార్డులు సంపాదించారు. వీటిని తయారు చేసి ఇచ్చిన వ్యక్తులు వారిని వెస్ట్‌బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా చూపించారు. ఈ ఆధార్ కార్డుల ఆధారంగా నగరానికి చేరుకున్న వీరు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరిలో పురుషులు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేసి వాటి ఆధారంగా ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేస్తుండగా... మహిళలు, యువతులు వ్యభిచార వృత్తిలో దిగారు. పరిచయస్తులతోనే ఈ దందా చేస్తున్న వారిని సంబందీకులైన పురుషులే తమ వాహనాలపై తీసుకెళ్లి కస్టమర్ల వద్ద వదిలి వస్తున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందాపై దక్షిణ మండల టాస్‌్కఫోర్స్‌కు సమాచారం అందడంతో సోమవారం వివిధ ప్రాంతాల్లో వరుస దాడులు చేసిన ప్రత్యేక బృందాలు మొత్తం 18 మందిని పట్టుకున్నాయి. వారి నుంచి వాహనాలు, నకిలీ గుర్తింపుకార్డులతో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోహింగ్యాల్లో కొందరిని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.

డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం.. దారి తప్పిన భార్య కథ
సాక్షి, హైదరాబాద్ : వాళ్లిద్దరూ భార్య భర్తలు. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్, లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, లెక్చరర్‌గా విద్యాబుద్ధులు నేర్పించే భార్య పక్కదారి పట్టింది. దారుణానికి ఒడిగట్టింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం, అనుకున్నట్లుగా భర్త చనిపోకపోవడంతో చివరికి పోలీసులకు పట్టుబడింది. దోషిగా కటకటాల్లోకి వెళ్లనుంది.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు సూత్రధారి, పాత్రదారి బాధితుడి భార్య ఫ్లోరా మరియా అని తేలడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.పోలీసుల వివరాల మేరకు, డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు.అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డొదగొట్టాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్, అతని స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే మట్టికి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్ కారును అడ్డగించి, అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులని తేలింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరచి, హత్యయత్నానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.