Director Christopher McQuarrie Clarifies On Rumours Of Prabhas In Mission Impossible 7 - Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీపై డైరెక్టర్‌ క్లారిటీ

Published Wed, May 26 2021 9:28 PM | Last Updated on Wed, May 26 2021 9:34 PM

Director Christopher McQuarrie Clarifies On Rumours Of Prabhas In Mission Impossible 7 - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. హాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ హాలీవుడ్​ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’లొ ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.  అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ మెక్​క్వారీ ప్రభాస్ పై హాలీవుడ్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. 

మీరు తెరకెక్కిస్తున్న ‘మిషన్‌ ఇంపాజిబుల్‌-7’లో ఇండియన్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ కీ రోల్‌ పోషించనున్నారంటూ గత కొంతకాలంగా ఇక్కడ పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దయచేసి అందులో ఎంత నిజముందో చెప్పగలరు?’ అని నెటిజన్‌ కోరగా.. ‘ప్రభాస్‌ ఎంతో టాలెంట్‌ కలిగిన వ్యక్తి.  కానీ ఇప్పటి వరకూ ఆయన్ని నేను కలవలేదు’ అని క్రిస్టోఫర్‌ రిప్లై ఇచ్చారు. ఆయన పెట్టిన ట్వీట్‌తో ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement