దర్శకుడు కదిర్, ఏఆర్ రెహమాన్
మ్యూజికల్ లవ్‌స్టోరీస్‌కు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు కదిర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ల కాంబినేషన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిపీట్ కానుంది. గతంలో ‘కాదల్ దేశమ్’ (తెలుగులో ‘ప్రేమ దేశం’), ‘కాదలర్ దినమ్’ (తెలుగులో ‘ప్రేమికుల రోజు’) తదితర బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు వీరిద్దరూ. అయితే 2002లో వచ్చిన ‘కాదల్ వైరస్’ తర్వాత కదిర్ మరే సినిమాకూ దర్శకత్వం వహించలేదు. ఇదిలా ఉంటే.. అబ్బాస్, హీరా, కునాల్, శ్రీదేవీ విజయ్‌కుమార్ తదితర ప్రతిభావంతులైన తారలను కదిర్ వెండితెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే.
అందుకే కదిర్ మాత్రమే తన కుమారుడు కిషోర్‌ని హీరోగా లాంచ్ చేసేందుకు కరెక్ట్ అని నిర్మాత రంగనాధన్ గట్టిగా భావించడంతో కదిర్ అజ్ఞాతవాసం ముగిసింది. సుదీర్ఘ విరామం తర్వాత మరో సినిమాకు దర్శకత్వం వహించడానికి సిద్ధమైన కదిర్.. ఈ ప్రేమకథా చిత్రానికి సంగీతాన్ని అందించేందుకు కూడా ఏఆర్ రెహమాన్‌నే ఎంచుకున్నారు. కొంత కాలంగా తనకు దర్శకత్వం ఆఫర్లు వస్తూనే ఉన్నాయని, అయితే ఇప్పటికి అన్నీ కుదిరాయని, సంగీత ప్రధానమైన ప్రేమక«థా చిత్రం కావడంతోనే ఈ సినిమాకు రెహమాన్ అయితే బాగుంటుందనుకున్నానని కదిర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment