కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ 2015లో 'ఉత్తమ విలన్' చిత్రంలో నటించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రాన్ని రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఉత్తమ విలన్ చిత్రానికి నిర్మాతలుగా కమల్ హాసన్, దర్శకుడు లింగుస్వామి ఉన్నారు. ఈ సినిమా పరాజయం పట్ల లింగుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
భారీ అంచనాలతో నిర్మించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా నష్టపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ఉత్తమ విలన్ వల్ల భారీగా నష్టపోవడంతో తమతో రూ. 30 కోట్లతో ఒక సినిమా చేస్తానని కమల్ హాసన్ అప్పట్లోనే మాట ఇచ్చారని లింగుస్వామి పేర్కొన్నారు. ఉత్తమ విలన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో వారం వారం కథలో కమల్ మార్చేవారని ఆయన అన్నారు. గతంలో కూడా కమల్ ఇలాంటి ప్రయోగాలు చేసి భారీ విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు. కానీ ఈ సినిమా విషయంలో వర్కౌట్ కాలేదు. ఈ కారణంతో భారీగా ఖర్చు పెరిగిపోయింది.
కొన్నేళ్ల క్రితం ఆయనతో 'దృశ్యం' సినిమా రీమేక్ చేయాలనుకుంటే అందుకు ఆయన అంగీకరించలేదు. కానీ అదే చిత్రాన్ని మరోకరు నిర్మించి విజయాన్ని అందుకున్నారుని లింగుస్వామి చెప్పుకొచ్చారు. ఉత్తమ విలన్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత కథలో పలు మార్పులు చేయాలని తాను సూచించినట్లు లింగుస్వామి తెలిపారు. తన అభిప్రాయం ప్రకారం కొన్ని సీన్లు తొలిగించేందుకు మొదట అంగీకరించిన కమల్ ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయకుండానే విడుదల చేయాలని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉత్తమ విలన్ వల్ల తాము లాభాలు చూశామని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని తనకు చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థ తాజాగా ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment