శేఖర్ కమ్ముల ఇటీవల డైరెక్ట్ చేసిన రెండు బ్లాక్ బస్టర్స్ ఫిదా, లవ్ స్టోరీలో సాయి పల్లవి నటన హైలైట్ గా నిలిచింది. రెండు సినిమాల్లోనూ ఈ నేచురల్ బ్యూటీ తనదైన నటనతో ఆకట్టుకుంది. డ్యాన్స్ విషయంలోనూ వావ్ అనిపించింది. మొత్తంగా ఫిదా, లవ్ స్టోరీస్ సూపర్ సక్సెస్ లో తనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది.
లవ్ స్టోరీ తర్వాత ప్రస్తుతం ధనుష్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ రైటింగ్స్ లో బిజీగా ఉన్నాడు డైరెక్టర్. ధనుష్ తో లవ్ స్టోరీ కాకుండా ఒక సీరియస్ సబ్జెక్ట్ ను డీల్ చేస్తాడట. అంతే కాదు తన కొత్త చిత్రంలో సాయి పల్లవి కాకుండా ఓ బాలీవుడ్ హీరోయిన్ కు అవకాశం ఇవ్వనున్నాడట. శేఖర్ కమ్ముల మూవీతో సాయి పల్లవి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టడం ఖాయం అనుకుంటుండగా మరో హీరోయిన్ ఆ అవకాశం అందుకుంటుండటంతో, సాయి పల్లవి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment