
ఓటీటీల పుణ్యమా అని ఢిపరెంట్ కంటెంట్‌తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. యువ దర్శకులు సైతం ప్రయోగాలు చేస్తున్నారు. ట్రెండింగ్ పాయింట్‌తో కథ రాసి సినిమాలు తీస్తున్నారు. రెండున్నర గంటల్లో చెప్పలేని కథని వెబ్ సిరీస్‌లుగా మార్చి ప్రేక్షకులను వినోదాన్ని అందిస్తున్నారు. ఇలా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు ఓటీటీలలో విడుదలవుతున్నాయి. అలా కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్, యూత్‌ను అట్రాక్ట్ చేసే కంటెంట్‌తో తెరకెక్కిన సినిమానే ‘ఏమి సేతురా లింగ’. ఈ చిత్రానికి కె.సందీప్ దర్శకత్వం వహించారు. వినోద్ వర్మ, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, కేశవ్ దీపక్,ఆనంద చక్రపాణి , మేకా రామకృష్ణ, పవన్ రమేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. గత శుక్రవారం(మార్చి 19) నుంచే ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
‘ఏమి సేతురా లింగ’చిత్రం కథేంటంటే..
భాను(వినోద్ వర్మ) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఉద్యోగం.. జీతం.. జీవితం..ఇలానే బతికేస్తుంటాడు. ‘డబ్బు వల్లే తాను హ్యాపీగా ఉంటున్నాను’ అనుకొని ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేస్తుంటాడు. కానీ బాస్ టార్చర్, పని ఒత్తిడి వల్ల.. చాలా ఒత్తిడికి లోనవుతాడు. ఇక పర్సనల్ లైఫ్ విషయంలో లవ్ లో కూడా కష్టాలే ఎదురవుతాయి. ప్రేమించానని చెప్పిన ఓ అమ్మాయి మోసం చేసి వెళ్లిపోతుంది. ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన భాను లైఫ్ లోకి స్వేచ్ఛ(జ్ఞానేశ్వరి కాండ్రేగుల) వస్తుంది. ఈమె చాలా ప్రాక్టికల్ అమ్మాయి. స్వేచ్ఛ ఎంటరయ్యాక భాను జీవితంలో ఎలాంటి మార్పులు ఏర్పడ్డాయి అనేది మితగా కథ.
(చదవండి: టిఫిన్‌లో చికెన్.. ఎన్టీఆర్ నాకు ఆప్యాయంగా వడ్డించారు: రామ్‌చరణ్)
బానుగా వినోద్ వర్మ సహజంగా నటించాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో ఈయన పాత్ర ద్వారా చూపించారు. స్వేచ్ఛ పాత్ర కూడా బాగుంది. హీరోకి మేనేజర్ పాత్రలో చేసిన కేశవ్ దీపక్ నవ్వులు పూయించారు. ముఖ్యంగా క్యాస్ట్ పిచ్చితో అతడు చేసే అరాచకాలు అంతా ఇంతా కాదు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.
దర్శకుడు కె.సందీప్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్న పాయింట్ ఎంచుకొని చక్కగా తెరకెక్కించాడు. ఇలాంటి కథకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కు ఈజీగా కనెక్ట్ అవుతుంది. జెన్ మార్టిన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు. తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా తీశారు.